Skip to main content

Chilipi Questions With Answers

Chilipi Questions With Answers
చిలిపి ప్రశ్నలు
చిలిపి ప్రశ్నలు

తాజ్ మహల్ ఎక్కడుంది? - భూమ్మీద. 

అందరికి నచ్చే బడి ఏమిటి? - రాబడి.

ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి? - ఇంటరాగేట్

అందరూ కోరుకునే సతి ఏమిటి? - వసతి.        
          
అన్నం తినకపోతే ఏమవుతుంది? - మిగిలిపోతుంది.

భార్య లేని పతి ఎవరు? - అల్లోపతి

వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి? - సెటైర్లు       
   
కరవలేని పాము? - వెన్నుపాము.

అందరికీ ఇష్టమైన కారం ఏమిటి? - ఉపకారం.

తినలేని కాయ ఏమిటి? - లెంపకాయ

వాహనాలకు ఉండని టైర్ ఏమిటి? - రిటైర్         
       
చెట్లు లేని వనం? - భవనం.   

గీయలేని కోణం ఏమిటి? - కుంభకోణం.

పూజకు పనికిరాని పత్రి ఏమిటి? - ఆసుపత్రి

వెలిగించలేని క్యాండిల్? - ఫిల్డర్ క్యాండిల్

తాగలేని పాలు ఏమిటి? - పాపాలు.         
       
మొక్కకు పూయని రోజాలు ఏమిటి? - శిరోజాలు.  

రుచి లేని కారం ఏమిటి? - ఆకారం

వేయలేని టెంట్ ఏమిటి? - మిలిటెంట్ 

చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? - బ్రౌన్ షుగర్       
     
స్త్రీ కాని స్త్రీ - ఇస్త్రీ 

కారు కాని కారు - షికారు, పుకారు

దానం కాని దానం - నిదానం

నారి లేని విల్లు ఏమిటి? - హరివిల్లు

డబ్బులుండని బ్యాంక్ ఏమిటి? - బ్లడ్ బ్యాంక్

కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది? - ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది.

కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి? - వడదెబ్బ     

కూర్చోలేని హాలు ఏమిటి? - వరహాలు.    

చేపల్ని తినే రాయి ఏమిటి? - కొక్కిరాయి.     

చారలు లేని జీబ్రా ఏమిటి? - ఆల్జీబ్రా

వేసుకోలేని గొడుగు ఏమిటి? - పుట్టగొడుగు.
 
కారం కాని కారం - ఉపకారం
                                  
కోడి కాని కోడి - పకోడి 

 దారం లేని దారం? (కేదారం)

పడుకోలేని చాప? (తెరచాప)

పరుగెత్తలేని కారు ఏమిటి? (పుకారు)

నడవలేని కాలు ఏమిటి? (పంపకాలు)

దేవుడు లేని మతం ఏమిటి? (కమతం)

ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?(న్యూస్ పేపర్)

రోజూ మారేదేది? (తేది)

చెట్లు లేని వనం ఏమిటి?(భవనం)

తాగలేని పాలు ఏమిటి? (పాపాలు)

కూర్చోలేని హాలు ఏమిటి? (వరహాలు)

వేయలేని టెంట్ ఏమిటి? (మిలిటెంట్)

వేసుకోలేని గొడుగు ఏమిటి? - (పుట్ట గొడుగు)

ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర? (విసన కర్ర)

రాజులు నివసించని కోట ఏది? (తులసి కోట)

కనిపించని గ్రహం ఏమిటి? (నిగ్రహం)

కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి? (వడదెబ్బ)

అందరికీ నచ్చే బడి ఏమిటి? (రాబడి)

విమానం అంత స్పీడుగా వెళ్లాలంటే ఏంచేయాలి? (విమానంలో ఎక్కి కూర్చోవాలి)

పగిలితేనే ఉపయోగపడేది ఏది? (కొబ్బరి కాయ)

పరుగులు పెడుతుంది కానీ నడవలేదు ఏమిటది? (సెలయేరు)

మనుషులు సంతోషాన్ని ఎక్కువగా దేనిలో పొందుతారు? (మనసులో)

వారంలో బడి అంటే పిల్లలకు ఇష్టమైన రోజు? (ఆదివారం)

చాలా వేడి కాఫీ తాగితే ఏమవుతుంది? (కప్పు ఖాళీ అవుతుంది)

ముంబాయి నుంచి ఢిల్లీ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్ లో వస్తే ఏమి జరుగుతుంది? (తడుస్తుంది ఇక్కడ రివర్స్ లోనంటే నదుల్లోనుంచి)

చీకట్లో దీపం ఎక్కువ కాంతినిస్తుంది ఎందుకు? (వెలిగిస్తాం కాబట్టి)

తినలేని చారు? (పచారు)

గుళ్లో ఉండని స్వామి? (భాగస్వామి)

మెడున్నా తల ఉండనిది ఏది? (బాటిల్ కి)

కాకి కావు కావుమని ఎందుకు అరుస్తుంది?(నోరుంది కాబట్టి)

పోపుల డబ్బాను తేలిగ్గా ఉంచాలంటే అందులో ఏం పెట్టాలి?(చిల్లుల)

నీరు ఎప్పుడు తాగగలం?(ద్రవరూపంలో ఉన్నప్పుడు)

బోరింగు ఎంత కొట్టినా బిందె నిండలేదు ఎందుకని?(బిందె తిరగేసి పెట్టారు కాబట్టి)

ఎదుటి వారు మన మాటలను ఆత్రుతగా వినాలంటే ఏమి చేయాలి?(మాట్లాడాలి)

ఈగ తేనెలో పడితే ఏమవుతుంది? (తేనెటీగ అవుతుంది)

మిరపకాయ కొరికితే ఏమవుతుంది?(ముక్కలవుతుంది)

సూర్యాస్తమయం స్పష్టముగా ఏ కాలంలో కనిపిస్తుంది?(సాయంకాలం)

నిఘంటువులో తప్పుగా ఉండే పదం? (తప్పు అనే పదమే)

ఒంటినిండా రంధ్రాలున్నా నీటిని నింపుకోగలదు, ఏమిటది? (స్పాంజి)

సూది, దారం అవసరం లేకుండానే ఎవరు కుట్టగలరు?(దోమలు, చీమలు)

తిరగలేని మర?(పడమర)

మిట్ట మధ్యాహ్నం అయ్యిందంటే చిన్నముల్లు, పెద్దముల్లు ఎక్కడుంటాయి?(గడియారంలో)

అన్నమాటకు వ్యతిరేకం?(తమ్ముని మాట)

HOTEL లో టీ ఎక్కడ ఉంటుంది?(O,E ల మధ్య)

పున్నమి నాడు చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తాడు?(మనం చూస్తాం కాబట్టి)

జనాలు గుడికెందుకు వెళతారు?(అవి మన దగ్గరకు రావు కాబట్టి)

ఒక వ్యక్తి విమానంలో నుంచి ప్యారాచుట్ లేకుండా కిందికి దూకినా ఏమి కాలేదు. ఎలా?(విమానం ల్యాండై ఉంది కాబట్టి)

వాటర్ లో ఐస్ వేస్తే ఏమవుతుంది?(ఐస్ వాటర్ అవుతుంది)

మీ ఒక చేతిలో యాభై మామిడి పండ్లు, మరో చేతిలో యాభై అరటి పండ్లు ఉన్నప్పుడు మీకు ఏమున్నట్టు?(రెండు పెద్ద చేతులున్నట్టు)

దేవుడు లేని మతం ఏది?(కమతం)

రాజులు నివసించని కోట ఏది?(తులసి కోట)

నోరు లేకపోయినా కరిచేవి, ఏవి?(చెప్పులు)

చేయడానికి ఇష్టపడని ధర్మం?(కాల ధర్మం)

ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర?(విసన కర్ర)

ఒక్క డ్రైవర్ తో నడిచే రెండు బస్సులు? (డబల్ డక్కర్ బస్సు)

ఆలోచన లేకుండా చేసే పని ఏది? (ఊపిరి పీల్చుకోవడం)

నిండు నూరేళ్ళు ఎవరు బ్రతుకుతారు? (ఆయుష్షు ఉన్నవాళ్ళు)

గడియారంలో పదమూడు గంటలు కొడితే అది ఏ సమయం? (రిపేరు సమయం)

భారతీయులు శ్రీలంక వాళ్ళకన్నా ఎక్కువ అన్నం తింటారెందుకు? (మన జనాభా ఎక్కువ కాబట్టి)

తిరుపతి లో ఎవరు గుండు కొట్టించుకుంటారు? (జుట్టు ఉన్నవాళ్ళు)

మనకు కలలు ఎందుకు వస్తాయి? (కంటాం కాబట్టి)

భరత్, పాకిస్తాన్ ల మధ్య ఏముంది? ('కామా' ఉంది)

అప్పుడప్పుడు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? (నవ్వలేవు కాబట్టి)

తినగలిగే నగ ?

> శనగ 

తినలేని ఫలం 

>కర్మ ఫలం 

మానవత్వం ఎక్కడుంటుంది?

>తెలుగులో

ఏనుగులు ఆహారాన్ని ఏ సమయంలో తింటాయి?

>ఆకలైన సమయంలో

చప్పట్లకు వ్యతిరేఖం ఏది?

>పుల్లట్లు 

ఇస్తానంటే వద్దనని బలి?

>అంబలి 

మొదటి ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?

>పెన్నుతో 

అల్లరి నరేష్ కారు నడపాలంటే ముందు ఏమి చేస్తాడు?

>కారు తలుపు తీస్తాడు.

గోడ మీద నుంచి టీవిలో సినిమా చూస్తున్న బల్లిపిల్లని
తల్లి ఏమని వారిస్తుంది?

>సినిమా బాగున్నా చప్పట్లు కొట్టద్దని 

గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు ?

>నుదుటికి 

రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు ఎలాగా?

>రసం తీసి 

ఈ ప్రపంచంలోనే ఉండదు.అయిన మనం వాడతాం.ఏమిటది ?

>గాడిద గుడ్డు 

డ్రైవర్ లేని బస్

>సిలబస్ 

చలి కాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది?

>కప్పు ఖాళీ అవుతుంది.

ఒకే గొడుగు కింద నలుగురు వెళ్ళినా, తడవలేదు. ఎందుకు? 

> వర్షం పడటం లేదు కాబట్టి 

లవర్ కి లవర్ ఏమి కడతాడు please tell మీ

>హోటల్ లో బిల్ కడతాడు

Comments

Popular posts from this blog

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles మెదడుకు మేత: ఆలోచింపజేసే 100 తెలుగు పొడుపు కథలు (With Answers) పిల్లల కోసం 100 తెలుగు పొడుపు కథలు (Telugu Podupu Kathalu with Answers) మీ మెదడుకు పదును పెట్టే 100 సరదా పొడుపు కథలు, వాటి జవాబులు ఇక్కడ ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు నచ్చే బెస్ట్ తెలుగు పొడుపు కథలు (Podupu Kathalu) చదవండి. 100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles సామాన్యమైన వస్తువులే కానీ సమాధానం చెప్పడం కష్టం! ఇక్కడ ఉన్న 100 తెలుగు పొడుపు కథలను మీరు ఛేదించగలరా? సమాధానాలతో సహా ఇప్పుడే చూడండి. పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచే 100 సులభమైన మరియు కఠినమైన పొడుపు కథలు. తెలుగులో జవాబులతో సహా (Telugu Riddles for Kids) ఇక్కడ చదవండి. ఇంటి వస్తువులు (Household Items)  1). దీనికి పళ్ళు (Teeth) ఉంటాయి కానీ ఎవరినీ కొరకదు. మన తలని అందంగా మారుస్తుంది. (దువ్వెన)  2). దీనికి ఒకే ఒక కన్ను ఉంటుంది. మనం దారం ఎక్కిస్తేనే బట్టలు కుడుతుంది. (సూది)  3). దీనికి ప్రాణం లేదు, కానీ ఇది లేకపోతే ఇల్లు సురక్షితం కాదు. దీని చెవి మెలితిప్పితేనే నో...

100 Funny Sametalu

100 సరదా సామెతలు 100 సరదా సామెతలు ఈ బ్లాగ్‌లో మీరు చదవబోయేది 100 సరదా సామెతలు వాక్యాలు. ఇవి మన తెలుగు పల్లెటూరి మాటల మాదిరిగానే చమత్కారంగా, నవ్వు తెప్పించేలా ఉంటాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను సరదాగా, వ్యంగ్యంగా చెప్పే ఈ వాక్యాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. 1). ఎండలో కట్టెలు తెచ్చినవాడే, నీడలో కూర్చున్నవారి దెబ్బలు తింటాడు. 2). పొట్టలో అన్నం లేనివాడే, దానం మీద పెద్ద బోధలు చెబుతాడు. 3). బుడతడు వంటచేస్తే, కారం ఎక్కువే ఉప్పు తక్కువే. 4). ఎద్దు లేనివాడే, పంట చేల లెక్కలు వేస్తాడు. 5). కోడిపుంజు లేనివాడే, ఉదయం కూయిస్తాడు. 6). గాజు ఇంట్లో వాడే, రాళ్లతో ఆడుకోవాలనుకుంటాడు. 7). చేతిలో పంచదార లేనివాడే, ఇతరుల చాయ్ తీపి తక్కువనుకుంటాడు. 8). వానలో తడిసిన వాడికే, ఎండలో నీడ విలువ తెలుస్తుంది. 9). కడుపు నిండిన వాడే, “అన్నం వృథా చేయొద్దు” అంటాడు. 10). బెల్లం రుచి తెలియని వాడే, తీపి గురించి బుద్ధులు చెబుతాడు. 11). ఆవు లేకపోయినా, పాలు అమ్ముతున్నట్లు లెక్కలు వేసేవాళ్లు చాలామంది. 12). బజార్లో గుడ్డు కొన్నవాడే, కోళ్ల పెంపకం మీద క్లాసు పెడతాడు. 13). పనేమీ లేకపోతే, పొరుగింటి పొయ్యి పొగ లెక్క...

చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers చిలిపి ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం? 1). హారం కాని హారం. తినే హారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2). రాయి కాని రాయి. ఎగిరే రాయి. ఏంటో తెలుసా? 3). చెవి కాని చెవి. భరోసానిచ్చే చెవి. అదేంటో చెప్పుకోండి చూద్దాం? 4). కాలు కాని కాలు. అందాన్నిచ్చే కాలు. ఏంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం?  1. ఆహారం 2. పావురాయి, కొక్కిరాయి 3. తాళం చెవి 4. జూకాలు