1. కొనే కాయే కానీ.. తినేకాయ కాదు.. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2. ఈ పంట ఆకులు, చెట్లులేని పంట మరియు నీటితోనే పండిస్తారు కానీ అందరికీ కావాలంటారు. ఆ పంట ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 3. సంతలన్నీ తిరుగుతాను. సమానంగా పంచుతాను. నేను ఎవరో చెప్పగలరా? 1. కుంకుడు కాయ 2. ఉప్పు 3. తక్కెడ 1. సన్నని దారిలో పోతుంది.. అందరికీ బట్టలు కుడుతుంది.. కానీ దానికి మాత్రం ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా ఉండదు. ఏంటో అది? 2. ఊరంతా తిరుగుతాయి.. కానీ ఇంటి గడప మాత్రం అస్సలు తొక్కవు. ఏంటవి తెలుసా? 3. ముప్పై రెండు తెల్లటి రాళ్ల మధ్యలో.. ఒక ఎర్రటి పాము ఉంటుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం. 4. ఉదయం, సాయంత్రం పెద్దగా ఉంటాను.. మధ్యాహ్నం అయ్యేసరికి చిన్నగా అయిపోతాను. నేనుంటే మీరూ ఉన్నట్టే.. నేనెవరో చెప్పగలరా? 5. అడవిలో పుట్టింది.. అడవిలో పెరిగింది.. ఒంటి నిండా నార.. కడుపు నిండా నీరు. దీనికి జవాబు ఈజీగానే చెప్పేయొచ్చు. 6. తల తీసేస్తే చేతికి వస్తుంది.. తోక తీసేస్తే పంటికి వస్తుంది. ఏంటది? సమాధానాలు: 1. సూది 2. చెప్పులు 3. నాలుక 4. నీడ 5. కొబ్బరికాయ 6. ఉంగరం (ఉం-గ...