Skip to main content

Posts

పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం

1). నేను పరుగు కి వ్యతిరేక దానిని మరియు ఒక ఆట ను 7 మంది తో ఆడుతారు. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). పెళ్లి ఆహ్వానానికి ఇచ్చేది మరియు దీనితో రాస్తారు. అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 3). "నేను మా నాన్న కూతురు ని మరియు నాకు ఆ పువ్వు అంటే ఇష్టం." ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం ? 4. "నేను నీకు ముందు కాదు మరియు కుండను ఇంకో విధంగా కూడా పిలుస్తారు." క తో End, క తో మొదలు అయిన పదాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 5. ఒక పక్షి లోటు జవాబు: 1. నడక, కబడ్డీ 2.పత్రిక, కలం 3. పుత్రిక, కలువ 4. వెనక, కడవ 5. పిచ్చుక, కరవు

నేనెవర్ని

నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  చందులో ✅. ఇందులో ❌.  దళంలో ✅. గళంలో ❌.  మాయలో ✅. ఛాయలో ❌.  మనంలో ✅. వనంలో ❌.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

సామెతలు

👉 _ టితో పోయేదాన్ని  _ డ్డలి దాకా తెచ్చుకోవడం పాత సామెత. 👉 మా _ లతో పోయేదాన్ని ఆపరేషన్ _ కా తెచ్చుకోవడం కొత్త సామెత.

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 1). నేను 3 అక్షరాల తెలుగు పదాన్ని.  గజంలో ✅. గళంలో ❌.  రుతువులో ✅. రుజువులో ❌.  గోవులో ✅. గోడలో ❌.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  అరుదులో ✅. బిరుదులో ❌.  నురుగులో ✅. పెరుగులో ❌.  రావిలో ✅. చెవిలో ❌.  గంపలో ✅. దుంపలో ❌.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం

Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం  Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం  1). బంటి _ _ ఏ ఆకారంలో ఉంటుందని _ _ జ అడుగుతోంది. 2). చంటి అక్కడ పెట్టిన పళ్లెంలోని ఆ _ _ మొత్తం తింటే బంగారు _ _ బహుమతిగా ఇస్తారట. 3). బంటి _ _ జావ తాగాలంటే _ _ చెంబు మాత్రమే వాడాలా? జవాబు: 1. భూమి 2. హారం 3.రాగి

తమాషా ప్రశ్నలు కి Answer చెప్పుకోండిచూద్దాం

తమాషా ప్రశ్నలు కి Answer చెప్పుకోండిచూద్దాం  తమాషా ప్రశ్నలు కి Answer చెప్పుకోండిచూద్దాం  1). వరం కాని వరం. ఈ వరం కొందరికి ఆనందం కలిగించేది మరియు బాధ కలిగించేది. ఆ వరం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 2). వనం కాని వనం. ఈ వనం కనిపించని వనం. ఆ వనం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 3). రింగ్ కాని రింగ్. ఈ రింగ్ ప్రాణాలు తీసే రింగ్. ఆ రింగ్ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 4). రాయి కాని రాయి. ఈ రాయి చేపల్ని తినే రాయి. ఆ రాయి ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Answers: 1.కలవరం 2. పవనం 3. ఫైరింగ్ 4. కొక్కిరాయి

వాక్యాల అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం

వాక్యాల అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం  వాక్యాల అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం  1). బంT ఎందుకు 6 బయట 7స్తూ ఉన్నావు. 2). మా చెల్లి Sరోజా లెక్కలు అర్థం కాకుంటే 7స్తోంది. 3). చంT 100న రావు బాగున్నారా? 4). పెద్దలకు 100నం చేయాలి..! 5). 1/2టి కాయ బజ్జీలు తినాలనిపిస్తుందా? 6). కూరలో ఉప్పు తక్కువ 1000 7). నువ్వు 10కాలాల పాటు చల్లగా ఉండాలి 8). చెడు వ్యసనాలతో ఆయువు 3తుంది.