Skip to main content

Posts

Showing posts with the label చిక్కుప్రశ్నలు

చిక్కుప్రశ్నలు

చిక్కుప్రశ్నలు విప్పండి 1. గడియారంలో ఎన్ని నంబర్లు ఉంటాయి? 2. ఒక కూరగాయలో మొదటి అక్షరం ప్రశ్నించడం, రెండో అక్షరం అగౌరవపరచడం, మూడోది గౌరవించడం. మరి ఆ కూరగాయ పేరేంటి? 3. యంత్రం కాని యంత్రం.. ప్రతి ఒక్కరికి సుపరిచితం. ఏంటది? 4. గాజు పూల కుండీని బండలపై వేసినా పగలకూడదంటే ఏం చేయాలి? 5. ఓ బాలికకు చివరి బర్త్ డే 10వది. రాబోయేది 12వ బర్త్ డే. ఎలా సాధ్యం? 6. ఇద్దరు బాలికలు. వారికి పేరెంట్స్ సేమ్. వారిద్దరూ ఒకటే నెల ఒకటే సమయానికి పుట్టారు. కానీ, వాళ్లు కవలలు కాదు. ఎందుకు? 7. O, T, T, F, ?, ?, ? ( ? స్థానంలో  వచ్చే అక్షరాలు ఏమిటి? ) 8. ఆల్ఫాబెట్స్లో ఉండే 7 నంబర్లు ఏవి? సమాధానాలు 1. 15 (1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 0, 1, 1) 2. క్యాబేజీ 3. సాయంత్రం 4. గాజు కుండీని మామూలుగా వేసినా బండ పగలదు 5. ఈ రోజు ఆ బాలిక 11వ బర్త్ డే. 6. వారు పుట్టిన సంవత్సరాలు వేరు. 7. F, S, S (O - One, T-Two, T-Three, F-Four . F-Five, S-Six, S-Seven) 8. I, V, X, L, C, D, M