1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'బలం'లో ఉంటాను కానీ 'ఫలం'లో లేను. 'రుతువు'లో ఉంటాను కానీ 'హేతువు'లో లేను. 'చెరువు'లో ఉంటాను కానీ 'చెరుకు'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'వాటా'లో ఉంటాను కానీ 'కోటా'లో లేను. 'రచ్చ'లో ఉంటాను కానీ ‘మచ్చ'లో లేను. 'సుత్తి'లో ఉంటాను కానీ 'కత్తి'లో లేను. 'జోడు'లో ఉంటాను కానీ 'జోరు'లో లేను. నేను ఎవరిని?