Skip to main content

Posts

Showing posts with the label నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం. 1). ఆరు అక్షరాల English పదాన్ని నేను. 4, 5, 6 అక్షరాలు కలిపితే 'ఆమె' అనీ. 3, 2, 5 అక్షరాలను కలిపితే 'కాలి వేలు' అనే అర్థాన్నిస్తా. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2). నేను ఏడు అక్షరాల English పదాన్ని. మొదటి నాలుగక్షరాలు కలిపితే 'పరీక్ష' అనీ. 6, 3, 4, 5 అక్షరాలు కలిపితే 'దీపం' అనే అర్థాన్నిస్తా. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? Answers :  1.MOTHER 2. EXAMPLE

నేను ఎవర్ని

1). అయిదక్షరాల పదాన్ని నేను.  ' పటం'లో ఉంటాను కానీ 'వాటం'లో లేను.  ' దన్ను'లో ఉంటాను కానీ 'జున్ను'లో లేను.  ‘ విల్లు'లో ఉంటాను కానీ 'ఇల్లు'లో లేను.  ‘ నోరు'లో ఉంటాను కానీ 'గోరు’లో లేను.  ' దండు'లో ఉంటాను కానీ 'మెండు'లో లేను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ? 2). నేను నాలుగక్షరాల పదాన్ని.  ' అరక’లో ఉంటాను కానీ 'కాకర’లో లేను.  ' జావ'లో ఉంటాను కానీ 'జామ'లో లేను.  ' తాకట్టు'లో ఉంటాను కానీ 'కనికట్టు'లో లేను.  ' దారం'లో ఉంటాను కానీ 'దానం'లో లేను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

1. నేను మూడు అక్షరాల తెలుగు పదాన్ని.  పవనంలో ఉంటాను. భవనంలో ఉండను.  కారులో ఉంటాను. కాలులో ఉండను.  వేగులో ఉంటాను. వేళలో ఉండను.  ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2. నేనో నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  మానులో ఉంటాను. పేనులో ఉండను. నక్కలో ఉంటాను. కుక్కలో ఉండను.  గోవులో ఉంటాను. గోడలో ఉండను.  రేడులో ఉంటాను. రేవులో ఉండను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

(1). నేను అయిదక్షరాల తెలుగు పదాన్ని. నాలో 1,4,5 కలిపితే ఖర్చు, 3,4,5 - సహకారం, 4,2 - ఓ ధ్యానం, 3,5 - వ్యాయామం అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?  (2). సాయం కానీ సాయం ఏమిటో చెప్పండి ? 👉 రెండిటికీ ఒకే జవాబు