Weight Loss - Belly Fat : బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తీసుకోండి సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇంటర్నెట్ డెస్క్ : సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఊబకాయం బారి నుంచి బయటపడటానికి చాలా మంది అనేక రకాల డైట్‌లు పాటిస్తుంటారు. బరువు తగ్గడం కోసం అన్నం తినడం మానేస్తారు. అన్నం తింటే బరువు పెరుగుతారని చాలా మంది దూరంగా ఉంటారు. అన్నానికి బదులుగా బరువు తగ్గడానికి ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ను నియంత్రించడానికి అన్నం స్థానంలో వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డాలియా : రవ్వలో ఇంకో రకమే ఈ డాలియా. దీన్ని విరిగిన గోధుమలు అని కూడా అంటారు. 91 గ్రాముల ...