Skip to main content

Weight Loss - Belly Fat : బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తీసుకోండి

Weight Loss - Belly Fat  : బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తీసుకోండి

సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


ఇంటర్నెట్ డెస్క్ : సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఊబకాయం బారి నుంచి బయటపడటానికి చాలా మంది అనేక రకాల డైట్‌లు పాటిస్తుంటారు. బరువు తగ్గడం కోసం అన్నం తినడం మానేస్తారు. అన్నం తింటే బరువు పెరుగుతారని చాలా మంది దూరంగా ఉంటారు. అన్నానికి బదులుగా బరువు తగ్గడానికి ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ను నియంత్రించడానికి అన్నం స్థానంలో వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

డాలియా :

రవ్వలో ఇంకో రకమే ఈ డాలియా. దీన్ని విరిగిన గోధుమలు అని కూడా అంటారు. 91 గ్రాముల డాలియాకు 76 కేలరీలు మాత్రమే లభిస్తాయి. అంటే వైట్ రైస్ కంటే 25 శాతం కేలరీలు తక్కువ అన్నమాట. శరీరానికి అందే పిండి పదార్థాలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి డాలియా చాలా మంచిది.

క్వినోవా :

దక్షిణ అమెరికాకు చెందిన క్వినోవా ఫిట్‌నెస్ ఔత్సాహికులలో ప్రజాదరణ పొందింది. చిన్న గింజలుగా ఉండే ఇవి గ్లూటెన్-రహితంగా ఉంటాయి. బియ్యం కంటే ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. మొత్తంగా తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇందులో రాగి, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

బార్లీ :

పురాతన సాగు ధాన్యాలలో ఒకటైన బార్లీ, బియ్యం కంటే ఎక్కువ ప్రోటీన్లు, ఫైబర్‌ను అందిస్తుంది. విటమిన్ B, జింక్ , మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

కాలీఫ్లవర్ రైస్ :

కాలీఫ్లవర్ రైస్‌ శరీరానికి తక్కువ కేలరీలను అందిస్తుంది. దీన్ని రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.


బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్‌లో వైట్ రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. బ్రౌన్ రైస్ అనేది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు బ్రౌన్ రైస్ చాలా మంచిది.

Comments

Popular posts from this blog

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles మెదడుకు మేత: ఆలోచింపజేసే 100 తెలుగు పొడుపు కథలు (With Answers) పిల్లల కోసం 100 తెలుగు పొడుపు కథలు (Telugu Podupu Kathalu with Answers) మీ మెదడుకు పదును పెట్టే 100 సరదా పొడుపు కథలు, వాటి జవాబులు ఇక్కడ ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు నచ్చే బెస్ట్ తెలుగు పొడుపు కథలు (Podupu Kathalu) చదవండి. 100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles సామాన్యమైన వస్తువులే కానీ సమాధానం చెప్పడం కష్టం! ఇక్కడ ఉన్న 100 తెలుగు పొడుపు కథలను మీరు ఛేదించగలరా? సమాధానాలతో సహా ఇప్పుడే చూడండి. పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచే 100 సులభమైన మరియు కఠినమైన పొడుపు కథలు. తెలుగులో జవాబులతో సహా (Telugu Riddles for Kids) ఇక్కడ చదవండి. ఇంటి వస్తువులు (Household Items)  1). దీనికి పళ్ళు (Teeth) ఉంటాయి కానీ ఎవరినీ కొరకదు. మన తలని అందంగా మారుస్తుంది. (దువ్వెన)  2). దీనికి ఒకే ఒక కన్ను ఉంటుంది. మనం దారం ఎక్కిస్తేనే బట్టలు కుడుతుంది. (సూది)  3). దీనికి ప్రాణం లేదు, కానీ ఇది లేకపోతే ఇల్లు సురక్షితం కాదు. దీని చెవి మెలితిప్పితేనే నో...

100 Funny Sametalu

100 సరదా సామెతలు 100 సరదా సామెతలు ఈ బ్లాగ్‌లో మీరు చదవబోయేది 100 సరదా సామెతలు వాక్యాలు. ఇవి మన తెలుగు పల్లెటూరి మాటల మాదిరిగానే చమత్కారంగా, నవ్వు తెప్పించేలా ఉంటాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను సరదాగా, వ్యంగ్యంగా చెప్పే ఈ వాక్యాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. 1). ఎండలో కట్టెలు తెచ్చినవాడే, నీడలో కూర్చున్నవారి దెబ్బలు తింటాడు. 2). పొట్టలో అన్నం లేనివాడే, దానం మీద పెద్ద బోధలు చెబుతాడు. 3). బుడతడు వంటచేస్తే, కారం ఎక్కువే ఉప్పు తక్కువే. 4). ఎద్దు లేనివాడే, పంట చేల లెక్కలు వేస్తాడు. 5). కోడిపుంజు లేనివాడే, ఉదయం కూయిస్తాడు. 6). గాజు ఇంట్లో వాడే, రాళ్లతో ఆడుకోవాలనుకుంటాడు. 7). చేతిలో పంచదార లేనివాడే, ఇతరుల చాయ్ తీపి తక్కువనుకుంటాడు. 8). వానలో తడిసిన వాడికే, ఎండలో నీడ విలువ తెలుస్తుంది. 9). కడుపు నిండిన వాడే, “అన్నం వృథా చేయొద్దు” అంటాడు. 10). బెల్లం రుచి తెలియని వాడే, తీపి గురించి బుద్ధులు చెబుతాడు. 11). ఆవు లేకపోయినా, పాలు అమ్ముతున్నట్లు లెక్కలు వేసేవాళ్లు చాలామంది. 12). బజార్లో గుడ్డు కొన్నవాడే, కోళ్ల పెంపకం మీద క్లాసు పెడతాడు. 13). పనేమీ లేకపోతే, పొరుగింటి పొయ్యి పొగ లెక్క...

చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers చిలిపి ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం? 1). హారం కాని హారం. తినే హారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2). రాయి కాని రాయి. ఎగిరే రాయి. ఏంటో తెలుసా? 3). చెవి కాని చెవి. భరోసానిచ్చే చెవి. అదేంటో చెప్పుకోండి చూద్దాం? 4). కాలు కాని కాలు. అందాన్నిచ్చే కాలు. ఏంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం?  1. ఆహారం 2. పావురాయి, కొక్కిరాయి 3. తాళం చెవి 4. జూకాలు