Skip to main content

Posts

Showing posts with the label కనుక్కోండి చూద్దాం

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం?

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం? 1). రీ న ష స్టే 2). షా లి స్పె టీ 3). తీ ర్ణ వ తం నా 4). ది చ వేర్చాక 5). స్క య రం శ్రే 6). పు లా శ్యా రం మ

Password ఏమిటో కనుక్కోండి చూద్దాం

ఈ రోజు ప్రశ్న ఒక అబ్బాయి Phone & Game ఆడుకుంటా అని చెప్పి వాళ్ళ అన్నయ్య దగ్గర Phone తీసుకున్నాడు. కాన్ని దానికి password ఉంది. అన్నయ్యని అడిగితే ఒక Code చెప్పాడు. దాన్ని డి code చేస్తే Password తెలుస్తుందన్నాడు. ఆరేంటంటే " పంచపాండవులు అవ్వదశపురాణాల్ని అష్టమి రోజున చదివారు" అని చెప్పాడు . ఇంతకి Password ఏంటి  కనుక్కోండి చూద్దాం?

ఇక్కడ ఎన్ని "నా" లు ఉన్నాయి కనుక్కోండి చూద్దాం

నీ నూనె నా నూనె అని నేను అన్నానా నా నూనె నీ నూనె అని నువ్వు అన్నావా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నీ నూనె నా నూనె కాదు నా నూనె నీ నూనె కాదు. ఇక్కడ ఎన్ని "నా" లు ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?

సరైన పదాలు కనుక్కోండి చూద్దాం

సరైన పదం రాయండి 1 జనవరి లో _ _ _ _ _మంట కాగుతాం.  2.మే లో  _ _ _ పాట విందాం  3. జూన్ లో  చకచక _ _ _ _ _ _ కి పోదాం. 4. నవంబరు లో _ _ _ చేసుకుందాం. 5. డిసెంబరు లో  _ _ _ _ _ జరుపుకుందాం. కామెంట్ చేయండి

కింది వాక్యాలలో " శరీర అవయవాల"కి సంబంధిపదాలు ఉన్నాయి. కనిపెట్టండి.

కింది వాక్యాలలో " శరీర అవయవాల"కి సంబంధిపదాలు ఉన్నాయి. కనిపెట్టండి. 1) నిప్పు ముట్టుకుంటే కాలుతుంది. 2) అమ్మా! ఈ రోజు పూరీలు చెయ్యి. 3) మా ఇల వేలుపు గంగమ్మ. 4) నాన్న గోరుచిక్కుడు కాయలు తెచ్చాడు. 5) త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి.

ఆ ఊరి పేరేమిటి ?

ఐదక్షరాల ఊరి పేరు..ఒకటీ ఐదు కలిపితే కూర వండుకోవచ్చు , కూస్తుందికూడా, ఒకటీ మూడూకలిపితే స్పృహలోలేనట్లే, రెండూ మూడు లకు "లు" కలిపితే మొహం తుడుచుకోవచ్చు , మూడూ నాలుగు ఐదూ కలిపి పప్పు గాని పచ్చడి గాని చేసుకోవచ్చు...పండు కూడా తినొచ్చు,నాలుగు ఐదూ మళ్ళీ రిపీట్ చేస్తే ...ఈ జ్ఞానం అంటారు. ఒకటీ రెండూ కలిపి భగవంతుణ్ణి ఏదైనా వరం అడగొచ్చు ...ఆ ఊరి పేరేమిటి ? Answer : కోరుమామిడి

కనుక్కోండి చూద్దాం

# కనుక్కోండి చూద్దాం 1. ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర 2. నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర 3. కాగితం చుడితే వచ్చే కూరగాయ 4. సమస్యలలో వున్న కూరగాయ

ఈ Lock నీ కనుక్కోండి చూద్దాం

పజిల్ ప్రశ్న: సంఖ్యాపరమైన లాక్‌లో 3-అంకెల కీ ఉంటుంది. దీన్ని తెరవడానికి సరైన కోడ్‌ను కనుక్కోండి చూద్దాం. Hints. 1) (6,8,2) ఒక సంఖ్య సరైనది మరియు బాగా ఉంచబడింది; 2) (6,1,4) ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది; 3) (2,0,6) రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పుగా ఉంచబడ్డాయి; 4) (7,3,8) ఏదీ సరైనది కాదు; 5) (7,8,0) ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది. ఇప్పుడు పై సూచనలను ఉపయోగించి పజిల్‌ను పరిష్కరించడానికి ప్రయత్నించండి మరియు సరైన 3 అంకెల కోడ్‌ను కనుగొనండి

నెలలో ఏ రోజు నా పుట్టినరోజు అని మీరు కనుగొనగలరా?

నా పుట్టినరోజు సమీపిస్తోంది మరియు నా పుట్టినరోజు  కోసం డబ్బు దాచాలని నిర్ణయించుకున్నాను. నెల మొదటి రోజు, నేను నా పిగ్గీ బ్యాంకులో ఒక రూపాయి ఉంచాను, రెండవది, నేను రెండు రూపాయిలు మరియు మూడవ రోజు, నేను మూడు మరియు మొదలైనవి ఉంచాను. నా పుట్టినరోజున, నా పిగ్గీ బ్యాంకులో మొత్తం 276 రూపాయిలు ఉన్నాయి. నెలలో ఏ రోజు నా పుట్టినరోజు అని మీరు కనుగొనగలరా?

కనుక్కోండి చూద్దాం

ఒక Room తెరవాలంటే  క్రింది నియమాలతో 3 అంకెల కోడ్‌ తాళంను కనుగొని Open చేయగలరా ..! (3,0,2)ఒక సంఖ్య సరైనది మరియు బాగా ఉంచబడింది; (3,5,6)ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది; (5,7,4)రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పుగా ఉంచబడ్డాయి; (6,8,9)ఏదీ సరైనది కాదు; (6,7,0)ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది

ఏవి మరియు ఏ క్రమంలో ఉన్నాయి?

ఒక వ్యక్తి తన పని భవనంలోకి ప్రవేశించాలనుకున్నాడు, కానీ అతను తన కోడ్‌ను మరచిపోయాడు. అయితే, అతను ఐదు ఆధారాలను గుర్తుంచుకున్నాడు. ఆ ఆధారాలు ఇవి: ఐదవ సంఖ్య మరియు మూడవ సంఖ్య పద్నాలుగుకి సమానం. నాల్గవ సంఖ్య రెండవ సంఖ్య కంటే ఒకటి ఎక్కువ. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే ఒకటి రెండింతలు తక్కువ. రెండవ సంఖ్య మరియు మూడవ సంఖ్య పదికి సమానం. మొత్తం ఐదు సంఖ్యల మొత్తం 30. ఐదు సంఖ్యలు ఏవి మరియు ఏ క్రమంలో ఉన్నాయి?

Name's దాగి ఉన్నాయి

ఇక్కడున్న వాక్యాల్లో ప్రాంతాల పేర్లు దాగి ఉన్నాయి. అవేంటో కనుక్కోండి చూద్దాం. 1. అతడి పేరు మధు. రకరకాల పక్షులు, జంతువుల గొంతులను మిమిక్రీ చేయగలడు. 2. పరశురాం.. చీమలు, తమ కంటే 20 రెట్ల ఎక్కువ బరువును మోయగలవు తెలుసా..!

రెండిటికీ మొదట చివర ఒకే జవాబు

సాధించగలరా? ఇక్కడ కొన్ని ఆంగ్ల అక్షరాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ఆ ఖాళీలను సరైన అక్షరాలతో పూరిస్తే.. రెండు అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. BAN _ _ _ _ FISHER 2. GO _ _ _ _ LOAD 3. PANT _ _ _ _ SELF 4. BUT _ _ _ SURE 5. HAT _ _ _ DISH

జింకలు మరియు బాతుల సంఖ్యను కనుగొనండి.

జంతుప్రదర్శనశాలలో జింకలు మరియు బాతులు ఉన్నాయి. తలలను లెక్కిస్తే మొత్తం 180, కాళ్లను లెక్కిస్తే మొత్తం 448 ఉంటాయి. జింకలు మరియు బాతుల సంఖ్యను కనుగొనండి.