WHO I AM? WHO I AM? 1). మూడు అక్షరాల తెలుగు పదాన్ని నేను. ' బలం'లో ఉంటాను కానీ 'ఫలం'లో లేను. ' రుతువు'లో ఉంటాను కానీ 'హేతువు'లో లేను. ' చెరువు’లో ఉంటాను కానీ 'చెరుకు'లో లేను. అయితే నేను ఎవర్ని? 2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని. ' వాటా'లో ఉంటాను కానీ ‘కోటా'లో లేను. ' రచ్చ'లో ఉంటాను కానీ ‘మచ్చ'లో లేను. ' సుత్తి'లో ఉంటాను కానీ 'కత్తి'లో లేను. ‘ జోడు'లో ఉంటాను కానీ 'జోరు'లో లేను. అయితే నేను ఎవర్ని? 3). నేను ఆరు అక్షరాల తెలుగు పదాన్ని. ' విజ్ఞానం'లో ఉంటాను కానీ ‘అజ్ఞానం'లో లేను. ' జయం'లో ఉంటాను కానీ ‘భయం'లో లేను. ' కాయ'లో ఉంటాను కానీ 'కారు'లో లేను. ‘ దడ'లో ఉంటాను కానీ 'వడ'లో లేను. ' శని'లో ఉంటాను కానీ 'మని'లో లేను. ‘ మిరు'లో ఉంటాను కానీ 'వారు'లో లేను. అయితే నేను ఎవర్ని?