1). నేను 4 అక్షరాల పదాన్ని. 'అత్త'లో ✅ 'నత్త’లో ❌. 'రణం'లో ✅ 'కణం'లో ❌. 'చేదు'లో ✅ 'కాదు'లో ❌. 'రాయి'లో ✅ 'రాణి'లో ❌. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? 2). నేను 3 అక్షరాల పదాన్ని. 'వల'లో ✅ 'అల’లో ❌. 'రవ్వ'లో ✅ 'అవ్వ'లో ❌. 'సగం'లో ✅ 'వేగం'లో ❌. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?