Skip to main content

Posts

Showing posts with the label కాయ కాని కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం

కాయ కాని కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం

కాయ కాని కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం కాయ కాని కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం కాయ కాని కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం 1). కాయ కాని కాయ. తప్పు చేస్తే ఈ కాయ లేదంటారు. ఆ కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - తల కాయ 2). కాయ కాని కాయ. దీపావళికి పేల్చే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - టపాకాయ 3). కాయ కాని కాయ.కోపం వస్తే ఎదుటివారికి ఇచ్చే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - లెంప కాయ 4). కాయ కాని కాయ. ఎక్కువ మాటలాడేవారిని ఇలా అంటారు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - వాగుడు కాయ 5). కాయ కాని కాయ. మన ప్రాణానికి ఆధారమైన కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - గుండె కాయ 6). కాయ కాని కాయ. పిల్లలు ఆడుకొనే కాయ. ఆ కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - గోళీ కాయ 7). కాయ కాని కాయ. తల కింద ఉండే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - మెడ కాయ 8). కాయ కాని కాయ. ఎండాకాలం కొంత మందికి వచ్చే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - చెమట కాయ 9). బడి పంతులు ఇచ్చే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - మొట్టి కాయ 10). చెరువు దగ్గర తిరిగే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? - ఎండ్ర కాయ