నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం 1). నేను 4 అక్షరాల పదాన్ని . 'నిప్పు'లో ✅ 'కప్పు'లో ❌. 'జాతి'లో ✅ 'గతి'లో ❌. 'కాయ'లో ✅ 'కారం'లో ❌. 'తీర్పు'లో ✅ 'మార్పు'లో ❌. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2) . నేను 3 అక్షరాల పదాన్ని. 'ఓటు'లో ✅ ‘పోటు'లో ❌. 'పిలుపు'లో ✅ 'మలుపు'లో ❌. 'కవిత'లో ✅ 'భవిత'లో ❌. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ? జవాబు: 1). నిజాయతీ 2). ఓపిక