1). నేను మూడు అక్షరాల తెలుగు పదాన్ని.
'పురుగు'లో ఉంటాను. కానీ 'పరుగు'లో లేను.
'అత్త'లో ఉంటాను కానీ 'అచ్చు'లో లేను.
'బడి'లో ఉంటాను కానీ 'బలం'లో లేను.
నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.
'చలం'లో ఉంటాను కానీ 'కలం'లో లేను.
'దరువు'లో ఉంటాను కానీ 'పరువు'లో లేను.
'రంపం'లో ఉంటాను కానీ 'పాపం'లో లేను.
'రాగం'లో ఉంటాను కానీ 'రాగి'లో లేను.
నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
Comments
Post a Comment