Chilipi Questions With Answers చిలిపి ప్రశ్నలు చిలిపి ప్రశ్నలు తాజ్ మహల్ ఎక్కడుంది? - భూమ్మీద. అందరికి నచ్చే బడి ఏమిటి? - రాబడి. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి? - ఇంటరాగేట్ అందరూ కోరుకునే సతి ఏమిటి? - వసతి. అన్నం తినకపోతే ఏమవుతుంది? - మిగిలిపోతుంది. భార్య లేని పతి ఎవరు? - అల్లోపతి వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి? - సెటైర్లు కరవలేని పాము? - వెన్నుపాము. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి? - ఉపకారం. తినలేని కాయ ఏమిటి? - లెంపకాయ వాహనాలకు ఉండని టైర్ ఏమిటి? - రిటైర్ చెట్లు లేని వనం? - భవనం. గీయలేని కోణం ఏమిటి? - కుంభకోణం. పూజకు పనికిరాని పత్రి ఏమిటి? - ఆసుపత్రి వెలిగించలేని క్యాండిల్? - ఫిల్డర్ క్యాండిల్ తాగలేని పాలు ఏమిటి? - పాపాలు. మొక్కకు పూయని రోజాలు ఏమిటి? - శిరోజాలు. రుచి లేని కారం ఏమిటి? - ఆకారం వేయలేని టెంట్ ...