1. ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టులేదు. కళ్లున్నాయి చూపులేదు 2. నీళ్లలో పుడుతుంది. నీళ్లలో పడితే చస్తుంది. 3. సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు. 4. నాగస్వరానికి లొంగని త్రాచు. నిప్పంటిచగానే తాడెత్తు లేస్తుంది. 5. ఈనదు, పొర్లదు, బంధం వేస్తే బిందెల పాలిస్తుంది? 1-5 జవాబులు : 1. కొబ్బరి కాయ 2. ఉప్పు 3. త్రాసు 4. చిచ్చు బుడ్డి 5. తాడిచెట్టు 6. నామము ఉంది గాని పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాను, నేను ఎవర్ని 7. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని ? 8. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు, నేను ఎవరిని ? 9. చారెడు కుండలో మానెడు పగడాలు, నేను ఎవరిని ? 10. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన, ఏమిటి అది ? 6- 10 జవాబులు: 6. ఉడత 7. మునక్కాయ 8. జల్లెడ 9. దానిమ్మ పండు 10. పాలు, పెరుగు, నెయ్యి 11. మూత తెరిస్తే, ముత్యాల పేరు,ఏమిటి అది ? 12. పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే, నేను ఎవరిని ? 13. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది!! అదేమిటి? 14. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. నేనెవర్ని 15. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. 11-15 జవాబులు: 11. దంతాలు 12. దీపం 13. వేరుశనగ కాయ 14. గుడ్డు 15...