Skip to main content

పొడుపు కథలు

1. ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టులేదు. కళ్లున్నాయి చూపులేదు

2. నీళ్లలో పుడుతుంది. నీళ్లలో పడితే చస్తుంది.

3. సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు.

4. నాగస్వరానికి లొంగని త్రాచు. నిప్పంటిచగానే తాడెత్తు లేస్తుంది.

5. ఈనదు, పొర్లదు, బంధం వేస్తే బిందెల పాలిస్తుంది?

1-5 జవాబులు :

1. కొబ్బరి కాయ

2. ఉప్పు

3. త్రాసు

4. చిచ్చు బుడ్డి

5. తాడిచెట్టు



6. నామము ఉంది గాని పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాను, నేను ఎవర్ని

7. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని ?

8. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు, నేను ఎవరిని ?

9. చారెడు కుండలో మానెడు పగడాలు, నేను ఎవరిని ?

10. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన, ఏమిటి అది ?

6- 10 జవాబులు:
6. ఉడత

7. మునక్కాయ

8. జల్లెడ

9. దానిమ్మ పండు

10. పాలు, పెరుగు, నెయ్యి


11. మూత తెరిస్తే, ముత్యాల పేరు,ఏమిటి అది ?

12. పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే, నేను ఎవరిని ?

13. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది!! అదేమిటి?

14. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. నేనెవర్ని

15. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.

11-15 జవాబులు:
11. దంతాలు

12. దీపం

13. వేరుశనగ కాయ

14. గుడ్డు

15. నిప్పు


16. దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు డొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?

17. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?

18. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?

19. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు కానీ జీవుల్ని చంపు.

20. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.

16- 20 జవాబులు:
16. చింతపండు

17. నత్త

18. పత్తి కాయ

19. వల

20. ఉంగరం


21. తలనుండి పొగ చిమ్ముతుండు భూతం కాదు, కన్ను లెర్రగా ఉండు రాకాసి కాదు, పాకి పోవు చుండు పాము కాదు, నేను ఎవరిని ?

22. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. పట్టుకుని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు.

23. ఎన్ని రేట్లు పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వచ్చేవి, ఏమిటవి ?

24. ముక్కు మీద కెక్కు. ముంద చెవులు నొక్కు. టక్కు నొక్కుల సోకు. జారిందంటే పుటుక్కు.

25. అడవిలో పుట్టింది, మేదరింట్లో మెలిగింది, ఒంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, నేను ఎవరిని ?

1-5 జవాబులు:
1. రైలు

2. తాళం

3. అయిదు పైసల బిల్లలు

4. కళ్లద్దాలు

5. మురళి


ఇంతకీ మీకెన్ని మార్కులొచ్చాయ్?

Comments

Popular posts from this blog

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles మెదడుకు మేత: ఆలోచింపజేసే 100 తెలుగు పొడుపు కథలు (With Answers) పిల్లల కోసం 100 తెలుగు పొడుపు కథలు (Telugu Podupu Kathalu with Answers) మీ మెదడుకు పదును పెట్టే 100 సరదా పొడుపు కథలు, వాటి జవాబులు ఇక్కడ ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు నచ్చే బెస్ట్ తెలుగు పొడుపు కథలు (Podupu Kathalu) చదవండి. 100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles సామాన్యమైన వస్తువులే కానీ సమాధానం చెప్పడం కష్టం! ఇక్కడ ఉన్న 100 తెలుగు పొడుపు కథలను మీరు ఛేదించగలరా? సమాధానాలతో సహా ఇప్పుడే చూడండి. పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచే 100 సులభమైన మరియు కఠినమైన పొడుపు కథలు. తెలుగులో జవాబులతో సహా (Telugu Riddles for Kids) ఇక్కడ చదవండి. ఇంటి వస్తువులు (Household Items)  1). దీనికి పళ్ళు (Teeth) ఉంటాయి కానీ ఎవరినీ కొరకదు. మన తలని అందంగా మారుస్తుంది. (దువ్వెన)  2). దీనికి ఒకే ఒక కన్ను ఉంటుంది. మనం దారం ఎక్కిస్తేనే బట్టలు కుడుతుంది. (సూది)  3). దీనికి ప్రాణం లేదు, కానీ ఇది లేకపోతే ఇల్లు సురక్షితం కాదు. దీని చెవి మెలితిప్పితేనే నో...

100 Funny Sametalu

100 సరదా సామెతలు 100 సరదా సామెతలు ఈ బ్లాగ్‌లో మీరు చదవబోయేది 100 సరదా సామెతలు వాక్యాలు. ఇవి మన తెలుగు పల్లెటూరి మాటల మాదిరిగానే చమత్కారంగా, నవ్వు తెప్పించేలా ఉంటాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను సరదాగా, వ్యంగ్యంగా చెప్పే ఈ వాక్యాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. 1). ఎండలో కట్టెలు తెచ్చినవాడే, నీడలో కూర్చున్నవారి దెబ్బలు తింటాడు. 2). పొట్టలో అన్నం లేనివాడే, దానం మీద పెద్ద బోధలు చెబుతాడు. 3). బుడతడు వంటచేస్తే, కారం ఎక్కువే ఉప్పు తక్కువే. 4). ఎద్దు లేనివాడే, పంట చేల లెక్కలు వేస్తాడు. 5). కోడిపుంజు లేనివాడే, ఉదయం కూయిస్తాడు. 6). గాజు ఇంట్లో వాడే, రాళ్లతో ఆడుకోవాలనుకుంటాడు. 7). చేతిలో పంచదార లేనివాడే, ఇతరుల చాయ్ తీపి తక్కువనుకుంటాడు. 8). వానలో తడిసిన వాడికే, ఎండలో నీడ విలువ తెలుస్తుంది. 9). కడుపు నిండిన వాడే, “అన్నం వృథా చేయొద్దు” అంటాడు. 10). బెల్లం రుచి తెలియని వాడే, తీపి గురించి బుద్ధులు చెబుతాడు. 11). ఆవు లేకపోయినా, పాలు అమ్ముతున్నట్లు లెక్కలు వేసేవాళ్లు చాలామంది. 12). బజార్లో గుడ్డు కొన్నవాడే, కోళ్ల పెంపకం మీద క్లాసు పెడతాడు. 13). పనేమీ లేకపోతే, పొరుగింటి పొయ్యి పొగ లెక్క...

చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers చిలిపి ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం? 1). హారం కాని హారం. తినే హారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2). రాయి కాని రాయి. ఎగిరే రాయి. ఏంటో తెలుసా? 3). చెవి కాని చెవి. భరోసానిచ్చే చెవి. అదేంటో చెప్పుకోండి చూద్దాం? 4). కాలు కాని కాలు. అందాన్నిచ్చే కాలు. ఏంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం?  1. ఆహారం 2. పావురాయి, కొక్కిరాయి 3. తాళం చెవి 4. జూకాలు