డాక్టర్ : ఇంత పెద్ద గాయం ఎలా అయింది, పళ్లు ఎందుకు ఊడిపోయాయి? చలపతి : నిన్న వర్షంలో నడుస్తుంటే మా ఆవిడ జారి పడింది డాక్టర్ : ఆవిడ పడితే నీ పళ్లు ఎందుకు ఊడాయి? చలపతి : ఆమె పడ్డప్పుడు బాదని ఆపుకోలేక పైకి నవ్వాను అంతే.
టీచర్: ఏరా రాము..! స్కూల్కి ఎందుకు లేటుగా వచ్చావ్? రాము: ఇంట్లో మా అమ్మానాన్న గొడవ పడుతున్నారు టీచర్ టీచర్: వాళ్లు గొడవ పడుతుంటే నీకేమైంది? రాము: నా స్కూల్ _ చెరొకటి వాళ్ల చేతిలో ఉండిపోయింది టీచర్.
నా పేరు చెపుకోండి..? నేనో పది అక్షరాల ఇంగ్లిష్ పదాన్ని. 7,9,10 అక్షరాలు కలిపితే "కొడుకు". 5,6,7,8,9,10 అక్షరాలు కలిపితే "దృష్టి". 10,9 అక్షరాలు కలిపితే "కాదు". 9,10 అక్షరాలు కలిపితే "మీద". 1,6,10 అక్షరాలను కలిపితే "డబ్బా" అని అర్థం వస్తుంది. ఇంతకీ నా పేరేమిటి చెప్పుకోండి చూద్దాం?
1). బ్యా రా ర లీ 2). గం జే ల సా 3). ప్ర చ్ ర్ ద్ 4). సౌ గూ ద్ర Q - ఇందులో ఒక ఒక సినిమా పేరు ? Q - ఇందులో ఒక క్రికెటర్ పేరు ? Q - ఇందులో హీరో పేరు ఉంది ?
Questions లోనే Answer చెప్పుకోండిచూద్దాం 1) నామమునకు మరియొక పేరు ? 2) తుంగభద్రానది ఏనదికి ఉపనదో చెప్పు కృష్ణా ? 3) పాలు ఏరంగో తెలుపు ? 4) ధనవంతులు ఏ వాహనంలో పోతారు షికారు ? 5) గోదావరి ప్రాంతంలో పండించే పంట ? కామెంట్ చేయండి
Questions నా దగ్గర 50రూ ఉంటే ఇలా ఖర్చు చేసాను ఖర్చు - మిగింది 20 - 30 15 - 15 9 - 6 6 - 0 -------------------- 50 - 51 అయితే ఆ ఒక్క రూపాయి ఎక్కడ నుంచి వచ్చిందొ మీకు తెలుసా ? చెప్పుకోండి చూద్దాం ?
ప్రశ్నలోనే జవాబు దాగి ఉంది. 1) గోదావరి ప్రాంతంలో పండించే పంట ఏది? 2)శాఖాహారంలో ఉండే ఆభరణం ఏది? 3) శ్వేతవర్ణం అంటే ఏమిటో తెలుపుము? 4) ఈ మైదానంలో ఏ పిండిని పారబోశారు ? 5) ఉత్తరంలో ఉండే దిక్కు ఏది ?
రెండింటికీ ఒక్కటే పదం ఏమిటో కనుక్కోండి చూద్దాం 1). వచ్చే ఆదివారం మేమంతా మా కొత్త _ _ లో షి _ _కు వెలుతున్నాం. 2). ప్రతి దానికి _ _ గటం కాకుండా, బుద్ధిగాం అడగడం _ _ వాటు చేసుకోవాలి. 3). బాలు _ _ మొదట్లోనే చేయవలసిన పనిని, _ _ వరకూ వాయిదా వేయడం ఎందుకు?
ఒక అమ్మాయి అబ్బాయిని లిఫ్టు అడిగింది దిగేటప్పుడు అబ్బాయి పేరు అడుగుతుంది. దానికి అతను 14,1,22,5,5,14 అని సమాధానం ఇస్తాడు. ఇంతకీ అతని పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
చెప్పుకోండి చూద్దాం. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు. రోజుకు ఒకసారి మారుతుంది, కానీ క్యాలెండర్ కాదు. దానికోసం పోటీలు పడతారు, ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
నేనొక ఐదు అక్షరాల పదాన్ని. దాదాపు ప్రతి పుస్తకంపై ఉంటా. నాలోని మొదటి అక్షరాన్ని తొలగిస్తే నేనొక ఆహార పదార్థాన్ని, నాలోని రెండవ అక్షరాన్ని కూడా తొలగిస్తే నేను చల్లగా ఉంటాను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?