ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని సంగీత వాయిద్యాల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి, అవేంటో కనిపెట్టండి చూద్దాం. 1. తను నా స్నేహితురాలు ప్రవీణ.. కలిసి చదువుకుందామని నేనే రమ్మని చెప్పా. 2. మా చెల్లి నవీన, మీ అక్క సమత.. బలాబలాలేంటో రేపు పోటీలో తెలుస్తాయిలే! 3. గత నెలలో భీమడోలు నుంచి తీసుకొచ్చిన స్నాక్స్ భలే రుచిగా ఉన్నాయి. 4. ఇక్కడున్నంత వరకు కాస్త తగ్గించుకో నీ ఆవేశం.. ఖండాంతరాల ఖ్యాతిని చెడగొట్టుకోకు.