పొడుపు కథలు
1). ముసుగేస్తే మూలకు కూర్చుంటాడు. కాగితం కనిపిస్తే మాత్రం కన్నీరు కారుస్తాడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
_ న్ను
2). వేలెడంత కూడా ఉండదు. కానీ దాని తోక మాత్రం బారెడు. ఇంతకీ అది ఏంటో తెలుసా?
_ ది
3). దెబ్బలు తిని నిలువునా ఎండిపోతుంది.. నిప్పుల గుండం తొక్కి బూడిదవుతుంది. ఏంటది?
పి _ క
4). దాన్ని కొడితే ఊరుకోదు.. గట్టిగా అరుస్తుంది.. దేవుడినే పిలుస్తుంది.. అదేంటి?
గు _ గంటలు
5). ఇష్టంగా తెచ్చుకుంటారు. చంపి ఏడుస్తారు?
ఎ _ గడ్డ
6). అన్నం పెడితే ఎగరదు. పెట్టకపోతే ఎగురుతుంది. ఏమిటది?
ఇ _ రాకు
7). ఇంట్లో ఉంటే ప్రమోదం, ఒంట్లో ఉంటే ప్రమాదం. ఏంటో తెలుసా?
పం _ దార
8). రెక్కలున్నా ఎగరలేదు.. ఎంత తిరిగినా ఉన్నచోటు నుంచి కదల్లేదు. ఏంటది?
_ న్
9). చెట్టుకి వేలాడుతుంది కానీ తేనెపట్టు కాదు.. మనం ఎక్కి కూర్చుంటాం కానీ కొమ్మ కాదు.. అదేంటి?
ఉ _ ల
10). అమ్మకి సోదరుడే కానీ అందనంత దూరంలో ఉంటాడు.. ఎవరు?
చం _ మామ
11). సముద్రంలో పుట్టి, సముద్రంలోనే పెరుగుతుంది. కానీ, ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. అదేంటి?
శం _
12). వారు ముగ్గురన్నదమ్ములు. రాత్రింబవళ్లూ పనిచేస్తూనే ఉంటారు. వారెవరు?
గడియారంలో ముళ్లు
13). పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది. తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఇంతకీ ఏంటది?
మొ _ లిపువ్వు
14). తోవలో పుట్టింది. తోవలో పెరిగింది. తోవలో పోయేవారిని అడ్డగించింది. ఏంటో తెలుసా?
ము _ మొక్క
15). పిడికెడు పొట్టోడు... కానీ కాపలాకు గట్టోడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
తా _ కప్ప
16). ఆకాశంలో తేలుతుంది. మేఘం కాదు. తోకాడిస్తుంది.. పిట్టకాదు. పట్టుతప్పితే ఎటో పారిపోతుంది. ఇంతకీ అదేంటో తెలుసా?
గా _ పటం
17). రెండు అందమైన కోటలు.. ఒకేసారి కదులుతాయి.. ఒకేసారి నిలబడతాయి. ఏంటవి?
బూ _
18). అందులో అన్నీ ముక్కలే ఉంటాయి. కానీ, అందరూ కాయ అని పిలుస్తుంటారు. అదేంటి?
ఆ _ కాయ
19). నాకు ఆరు ముఖాలు ఉంటాయి.. కానీ శరీరం
లేదు. 21 కళ్లు ఉంటాయి.. కానీ, చూడలేను. ఇంతకీ నేనెవర్ని?
_ స్
20). నడిచేటప్పుడు ఎగురుతాను.. నిల్చున్నప్పుడు కూర్చుంటాను.. నేనెవర్ని?
కం _ రు
21. కానరాని అడవిలో నీళ్లు లేని మడుగు. నీళ్లు లేని మడుగులో కానరాని నిప్పు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
ఆకలి
22. నీతో దెబ్బలు తిన్నాను. నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండం తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను. ఏంటో తెలుసా?
పిడక
23. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు. చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
నీటి బుడగ
24. కాళ్లు లేవు కానీ నడుస్తుంది. కళ్లు లేవు కానీ ఏడుస్తుంది?
మేఘం
25. చూస్తే ఒకటి, చేస్తే రెండు.. తలకు, తోకకు ఒకటే టోపీ.. ఇంతకీ ఏంటది?
పెన్ను
26. జానెడు పిట్ట.. అరిచి గోల పెడుతుంది.. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది. ఏంటది?
సెల్లఫోన్
27. తెలిసేట్టు పూస్తుంది.. తెలియకుండా కాస్తుంది. అదేంటి?
వేరుశనగ
28. కదలవు కానీ పెరుగుతాయి.. తరుగుతాయి. ఏంటవి?
మెట్లు
29. తిండి తినకుండా, నిద్రపోకుండా ఇంటికి కాపలా కాస్తుంది. ఎవరెంత కొట్టినా అరవలేదు. అదేంటి?
తాళ్లం
30. అబద్ధం అంటే తెలియనిది. ఏంటది?
అద్దం
31. తల ఉన్నా.. కాళ్లు లేనిదేంటి?
గుండు సూది
32. తడిస్తే గుప్పెడు.. ఎండితే బుట్టెడు. అదేంటబ్బా?
దూది
33. కానరాని అడవిలో నీళ్లు లేని మడుగు. నీళ్లు లేని మడుగులో కానరాని నిప్పు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
ఆకలి
34. నీతో దెబ్బలు తిన్నాను. నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండం తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను. ఏంటో తెలుసా?
పిడక
35. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు. చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు. మెరుస్తుంది. కానీ మెరుపు కాదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
నీటి బుడగ
36. గోడమీద బొమ్మ. గొలుసుల బొమ్మ. వచ్చీపోయేవారికి వడ్డించే బొమ్మ. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
తేలు
37. చేయని కుండ, పోయని నీరు, వేయని సున్నం, తింటే మాత్రం తీయగా ఉండు. ఏమిటో?
కొబ్బరికాయ
38. ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది.
ఊయల
39. కోటగాని కోట ఇంటికో కోట
తులసి కోట
40. ఇక్కణ్నుంచి చూస్తే ఇనుము, దగ్గరికి పోతే గుండు. పట్టి చూస్తే పండు, తింటే తీయగనుండు
తాటిపండు
41. నల్ల కుక్కకు నాలుగు చెవులు. ఏంటది?
లవంగం
42. అడ్డంగా కోస్తే చక్రం.. నిలువుగా కోస్తే శంఖం. అదేంటి?
ఉల్లిగడ్డ
43. ఊరందరికీ ఒకటే దీపం. ఏంటబ్బా?
సూర్యడు
44. అబద్ధం అంటే తెలియనిది?
అద్దం
45. ఏ దేశానిదైనా అన్ని దేశాలూ తిరుగుతుంది. అదేంటి?
విమానం
46. ఆకులు లేకుండానే తీగ పాకుతుంది.. ఏంటది?
కరెంట్ తీగ
47. అయిదు వేళ్లతో చేసిన అప్పడాన్ని గోడకేసి కొడతారు.. అదేంటి?
పిడక
48. కూత పెడుతుంది.. పరుగులు తీస్తుంది.. కానీ, ఎరుపు రంగును చూస్తే ఆగిపోతుంది.. ఏంటది?
రైలు
49. కోట లేదు.. సింహసనమూ లేదు. కానీ, కిరీటం మాత్రం ఉంది. ఏంటబ్బా?
కోడిపుంజు
50. కంటికి కనిపిస్తుంది.. ముక్కుకూ తెలుస్తుంది.. కానీ, చేతికి దొరకదు. ఏమిటో?
పొగ
51. కాళ్లు లేవు కానీ నడుస్తుంది. కళ్లు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటో తెలుసా?
మేఘం
52. ఎంత దానం చేసినా తరగనిది, అంతకంతకూ పెరిగేది. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
విద్య
53. కూతవేసి పరుగు తీస్తా. ఎరుపు చూస్తే మాత్రం ఆగిపోతా. ఇంతకీ నేనెవరో తెలుసా?
రైలుబండి
54. చెప్పిందే చెప్పినా... చిన్నపాప కాదు.. ఎక్కడి పండ్లు తిన్నా, దొంగ కాదు. ఏంటో తెలుసా?
రామచిలుక
55. నీతో దెబ్బలు తిన్నాను. నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండం తొక్కాను. గుప్పెడు బూడిద అయ్యాను. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
పిడక
56. వేలెడంత ఉండదు కానీ మనం బయటికి వెళ్లాలన్నా, లోపలికి రావాలన్నా కావాల్సింది ఇదే! ఏంటదీ?
తాళం చెవి
57. దీని నుంచి ఎంత ఎక్కువ తీస్తుంటే, అంత పెద్దది అవుతుంది. ఏంటదీ?
గొయ్యి
58. వాయువేగాన్ని మించి, లోకాలన్నీ గాలించి, చిటికెలో ఉన్న చోటుకు వచ్చేస్తుంది. ఏంటదీ?
మనసు
59. వెలుతురులో నీతోటే ఉంటుంది. చీకటిలో తప్పించుకుపోతుంది?
నీడ
60. అటూ-ఇటూ తిరిగే దీపం గాలి, వానకు ఆరని దీపం ఏంటది?
మిణుగురు పురుగు
61. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఏమిటది?
నీటి బుడగ
62. మామూలు వేళలో మర్యాదగా ఉంటుంది. ఎండకు, వానకు నెత్తినెక్కుతుంది?
గొడుగు
63. నోరు లేదు కానీ కబుర్లు చెబుతుంది. చెవులు లేవు కానీ గలగలా మాట్లాడుతుంది. అదేంటి?
సెల్ ఫోన్
64. పళ్లెం నిండా పదార్థాలున్నా.. ఇది లేకపోతే ఏమీ తినలేరు. ఏంటది?
ఆకలి
65. తోలు నలుపు.. తింటే పులుపు. ఏంటబ్బా?
చింతపండు
66. దాస్తే పిడికిలిలో పడుతుంది.. తీస్తే గది మొత్తం వ్యాపిస్తుంది. ఏమిటో?
దీపం
67. తెల్లని సువాసనల మొగ్గ. ఎర్రగా పూసి మాయమై పోతుంది. ఏమిటది?
కర్పూరం
68. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే! ఏంటో చెప్పుకోండి చూద్దాం?
ఆవలింత
69. ఒక దూలానికి నలుగురు దొంగలు. ఏంటో తెలుసా?
లవంగం
70. ముఖం లేకున్నా.. బొట్టు పెట్టుకుంటుంది. ఏంటది?
గడప
71. రెక్కలు లేని పిట్ట. గూటికి మాత్రం సరిగా చేరింది. ఇంతకీ అదేంటో తెలుసా?
ఉత్తరం
72. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట. తోకతో నీళ్లు తాగుతుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
దీపం
73. కొని తెచ్చుకుంటారు. కోసి ఏడుస్తారు. అదేంటో తెలుసా?
ఉల్లిపాయ
74. తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి, అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్లు పోతాడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
గడియారం ముళ్లు
75. అన్నింటికన్నా విలువైనది. అందరికీ అవసరమైనది. అది లేకుంటే ఇంకేదీ అవసరం లేదు. ఇంతకీ ఏంటది?
ప్రాణం
76. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం. చెప్పుకోండి చూద్దాం?
తేనెపట్టు
77. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు. అనుమతి లేకుండా ఎక్కడి పండ్లను తిన్నా దొంగ అసలే కాదు. ఏంటో తెలుసా?
రామచిలుక
78. నీటిమీద తేలుతుంది కానీ పడవకాదు. చెప్పకుండా పోతుంది కానీ ప్రాణం కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఇంతకీ ఏంటది?
నీటి బుడగ
79. కడుపులోన పిల్లలు.. కంఠములోన నిప్పులు. ఆరుపేమో ఉరుము..ఎరుపంటే మాత్రం భయం?
బొగ్గుతో నడిచే రైలు
80. రూపం నల్లన.. రాగమేమో తియ్యన. ఏంటో తెలుసా?
కోకిల
81. చూపు లేని కన్ను. సుందరమైన కన్ను. మీకు తెలిస్తే చెప్పండి?
నెమలి పించం
82. కళ్లు లేకపోయినా ఏడుస్తుంది. రెక్కలు లేకపోయినా గాల్లో ఎగురుతుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
మేఘం
83. మూత తెరిస్తే, ముత్యాల పేరు.. ఏమిటో?
దంతాలు
84. మొదట చప్పన, నడుమ పుల్లన, కొసన కమ్మన.. ఏంటవి?
పాలు,పెరుగు, నెయ్యి
85. రెక్కలు లేని పిట్ట. గూటికి మాత్రం సరిగా చేరింది. ఏంటో తెలుసా?
ఉత్తరం
86. అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ అది మాత్రం అక్కడే ఉంటుంది. ఏంటది?
నిచ్చెన
87. బంగారు బంతిలో రత్నాలు.. పగలగొడితే కానీ బయటకు రావు. ఏంటబ్బా?
దానిమ్మ
88. పొట్టలో వేలు.. నెత్తిమీద రాయి.. అదేంటి?
ఉంగరం
89. లోపల బంగారం.. బయట వెండి.. ఏమిటో?
కోడిగుడ్డు
90. మొగ్గగా ఉంటే చేతిలో, పువ్వు అయితే నెత్తిమీద ఉంటుంది. ఏంటది?
గొడుగు
91. దాన్ని చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్లే. అదేమిటో?
అద్దం
92. అందరిని పైకి తీసుకెళ్తాను. కానీ నేను మాత్రం వెళ్లలేను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
నిచ్చెన
93. నాకు చాలా కన్నులున్నాయి. కానీ నేను చూసేది మాత్రం రెండింటి తోనే. ఇంతకీ నేనెవరో తెలుసా?
నెమలి
94. రాజుగారి తోటలో రోజాపూలు చూసేవారే కానీ, కోసేవారు లేరు ఏమిటవి?
నక్షత్రాలు
95. ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న అణిగిమణిగి ఉంటుంది. ఏంటో తెలుసా?
విస్తరాకు
96. ఒళ్లంతా ముళ్లు, కడుపంతా చేదు. ఏంటో తెలుసా?
కాకరకాయ
97. పాము లేదు కానీ పుట్ట ఉంది. తల లేదు కానీ గొడుకు వేసుకుంది. ఏంటది?
పుట్టగొడుగు
98. ఎర్రటి పండు మీద ఈగ అయినా వాలదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
నిప్పు
99. తడిస్తే గుప్పెడు. ఎండితే బుట్టెడు. ఏంటో తెలుసా?
పత్తి
100. చక్కగా పెట్టడానికి వీలవుతుంది.. కానీ, తీయబోతే మాత్రం చెరిగిపోతుంది. ఏంటది?
ముగ్గు
101. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వస్తాయి. మళ్లీ కొన్నేళ్లకు ఊడిపోతాయి. ఏంటబ్బా?
దంతాలు
102. ఒళ్లంతా రంధ్రాలే అయినా.. నీటిని మాత్రం దాచుకోగలదు.. అదేంటి?
స్వాంజి
103. దంతాలున్నా, నోరు మాత్రం ఉండదు.. అదేంటో తెలిసిందా?
రంపం
104. ఆకు వేసి వడ్డిస్తారు కానీ, ఆ ఆకును తీసేసి అన్నం తింటారు. అదేంటో?
కరివేపాకు
105. కానరాని అడవిలో నీళ్లు లేని మడుగు.. నీళ్లు లేని మడుగులో కానరాని నిప్పు. ఏమిటో?
ఆకలి
106. పోక చెక్కంతటి పొట్టిదే కానీ, కాగంత కడవను మోస్తుంది. ఏంటబ్బా?
పొయ్యి
107. కోట కాని కోట.. ఇంటికో కోట. అదేంటి?
తులసి కోట
108. కత్తులు లేని భీకర యుద్ధం.. గెలుపోటములు చెరిసగం.. ఏంటో తెలిసిందా?
చెస్
109. ఆకాశాన పటం.. తోక మాత్రం కిందే.. ఏంటది?
గాలి పటం
110. లాగి విడిస్తేనే బతుకు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
ఊపిరి
111. రాళ్ల అడుగున విల్లు. విల్లు కొనన ముల్లు. ఇంతకీ అదేంటో తెలుసా?
తేలు
112. కడుపు నిండా రాగాలు. ఒంటి నిండా గాయాలు ఏంటో చెప్పగలరా?
పిల్లనగ్రోవి
113. పాములను చంపగలను కానీ గద్దను కాదు.. ఒళ్లంతా కళ్లే కానీ ఇంద్రుడిని కాదు.. నాట్యం చేస్తాను కానీ శివుడిని కాదు.. ఇంతకీ నేను ఎవరిని?
నెమలి
114. అమ్మ సోదరుడిని కాను.. అత్తకు భర్తనూ కాను.. కానీ, అందరికీ మామనే. ఎవరినబ్బా?
చందమామ
115. కొమ్ములుంటాయి కానీ ఎద్దుని కాను.. అంబారీ ఉంటుంది కానీ ఏనుగును కాను.. ఎవరినో చెప్పగలరా?
నత్త
116. కడుపు నిండా నల్లటి రాళ్లు, తెల్లటి పేగులు. ఏంటది?
సీతఫలం
117. చక్కని మానుకు కొమ్మలే లేవు. అదేంటో?
గడ్డపార
118. ఇల్లంతా వెలుగే కానీ, బల్ల కింద మాత్రం చీకటి. ఏంటబ్బా?
దీపం
119. కప్ప తాకని నీరు.. పురుగు పట్టని పువ్వు. ఏంటో తెలిసిందా?
కొబ్బరికాయ
120. తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు
121. కాళ్లు లేవు గానీ నడుస్తుంది G కళ్లు లేవు గానీ ఏడుస్తుంది? -
జ. మేఘం
122. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ
123. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం
124. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు
125. నిలబడితే నిలుస్తుంది, కూర్చు :-గే కూలబడుతుంది?
జ. నీడ
126.ఓ చెట్టునుండి ఒక పండు రాలింది
ఆ పండు కోసం ఇద్దరు పరుగెత్తారు
పరుగెత్తిన వాళ్ళకి దొరకలేదు
పరుగెత్తని వాళ్ళకి దొరికింది -
దొరికిన వాళ్ళు తినలేదు
దొరకని వాళ్ళు తిన్నారు
తిన్నవాళ్ళని కొట్టలేదు
తినని వాళ్ళని కొట్టారు
కొట్టిన వాళ్ళు ఏడవలేదు
కొట్టని వాళ్ళు ఏడ్చారు
అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
127. మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు ఉంటాయి అయితే అది ఏమిటది?
జ. నిచ్చెన
128. ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
జ. సూర్యుడు, చంద్రుడు.
129. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ ఉంటుంది అది ఏమిటో చెప్పండి?
జ. రామచిలుక
130. తలపుల సందున మెరుపుల గిన్నె అది ఏమిటో చెప్పండి.
జ. దీపం
131. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి ఉంటుంది అది ఏమిటో చెప్పండి?
జ. ఉంగరం
132. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
జ. సూది
133. నూరు పళ్లు, ఒకటే పెదవి అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
జ. దానిమ్మ
Comments
Post a Comment