కాయ కాని కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం
కాయ కాని కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం
- తల కాయ
2). కాయ కాని కాయ. దీపావళికి పేల్చే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- టపాకాయ
3). కాయ కాని కాయ.కోపం వస్తే ఎదుటివారికి ఇచ్చే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- లెంప కాయ
4). కాయ కాని కాయ. ఎక్కువ మాటలాడేవారిని ఇలా అంటారు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- వాగుడు కాయ
5). కాయ కాని కాయ. మన ప్రాణానికి ఆధారమైన కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- గుండె కాయ
6). కాయ కాని కాయ. పిల్లలు ఆడుకొనే కాయ. ఆ కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- గోళీ కాయ
7). కాయ కాని కాయ. తల కింద ఉండే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- మెడ కాయ
8). కాయ కాని కాయ. ఎండాకాలం కొంత మందికి వచ్చే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- చెమట కాయ
9). బడి పంతులు ఇచ్చే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- మొట్టి కాయ
10). చెరువు దగ్గర తిరిగే కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
- ఎండ్ర కాయ
Comments
Post a Comment