మెదడుకు మేత విజయ్ అరకు వెళ్ళాలనుకున్నాడు తన బైక్ లో విశాఖపట్నం నుండి... విశాఖపట్నం ఊరి చివరికి వచ్చేశాడు అక్కడ రెండు రహదారులు ఉన్నాయి. ఒకటి కుడి వైపు వెళ్తుంది, మరొకటి ఎడమ వైపుకు వెళుతుంది. ఇందులో ఒక రోడ్డులో మాత్రమే అరకు కు వెళ్ళవచ్చు. ఆ ప్రదేశంలో ఎటువంటి గుర్తులు కానీ, సైన్ బోర్డుకు కాని లేవు. అక్కడే పక్కన ఒక మర్రిచెట్టు మర్రి చెట్టు నీడలో సురేష్ నరేష్ అనే ఇద్దరు కూర్చున్నారు. వారిలో ఒకడు ఎప్పుడు అపద్ధమే చెబుతాడు, మరొకడు ఎప్పుడు నిజమే చెబుతాడు. ఇప్పుడు విజయ్ వారి సహాయంతో దారి ఎలా కనుక్కున్నాడు?