Skip to main content

Posts

నేనెవర్ని

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'ఊపిరి'లో ఉంటాను కానీ 'పిరికి'లో లేను. 'లయ'లో ఉంటాను. కానీ 'ఈల'లో లేను. 'లత'లో ఉంటాను కానీ 'మమత'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'దారం'లో ఉంటాను కానీ 'ఘోరం'లో లేను. 'పత్తి'లో ఉంటాను. కానీ 'సుత్తి'లో లేను. 'బరి'లో ఉంటాను. కానీ 'బలి'లో లేను. 'కంచు'లో ఉంటాను కానీ 'మంచు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

చెప్పుకోండి చూద్దాం

ఒక అమ్మాయి ఒక Shop వెళ్ళి  200 తో Mobile రీచార్జ్ చేసుకోని 2000 నోట్ ఇచ్చింది. ఆ నోట్ పక్క షాపులో ఇచ్చి చిల్లర తెచ్చి ఆమెకు ఇవ్వవలసిన 1800 ఇచ్చి పంపేసాను. తర్వాత ఆమె ఇచ్చిన  2000  దొంగ నోట్ చెప్పి నాకు ఇచ్చి, నా దగ్గర వేరే 2000 నోటు తీసుకుపోయాడు  ఇప్పుడు నాకు ఎంత నష్టం వచ్చింది!

Guess me

కొత్త పట్టణంలో 100 ఇళ్లను నిర్మించారు. ఒక్కో ఇంటికి 1 నుంచి 100 నంబర్లతో ప్లేట్లు తయారు చేశారు. ఈ ప్లేట్లు పై 9 సంఖ్య ఎన్నిసార్లు కనిపిస్తుంది? 100 houses were built in the new town. Plates numbered from 1 to 100 were made for each house. How many times does the number 9 appear on these plates?

పొడుపు కథలు

1. లాగి విడిస్తేనే బతుకు. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2. రాళ్ల అడుగున విల్లు. విల్లు కొనన ముల్లు. ఇంతకీ అదేంటో తెలుసా? 3. కడుపు నిండా రాగాలు. ఒంటి నిండా గాయాల ఏంటో చెప్పగలరా?