Skip to main content

Posts

తిక మక ప్రశ్నలు

(1) పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? జ. గ్రానైట్ (2). ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి? జ. న్యూస్ పేపర్. (3). వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? జ. ఫైరింగ్

నేనెవర్ని

నేనెవర్ని? నేనో మూడక్షరాల పదాన్ని. 'వల'లో ఉంటాను. 'అల'లో ఉండను. 'మీసం'లో ఉంటాను. 'మీనం'లో ఉండను. 'కాంతం'లో ఉంటాను. 'కాంతి'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

Logic Question

1200 మంది కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు ఒక రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రతి 15 మంది కానిస్టేబుళ్లకు ఒక ఎస్ఐని కేటాయిస్తే, ఆ రైళ్లో ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు? 70 75 80 85

Logic Question

ఒక సమూహంలో కొన్ని ఆవులు, కోళ్ళు ఉన్నాయి. వాటి తలలు 48, కాళ్లు 140. అయితే ఆ సమూహంలో ఎన్ని ఆవులు ఉన్నాయి? 26 12 22 32

నేనెవర్ని

నేనెవర్ని? నేనో మూడక్షరాల పదాన్ని. 'సీసా'లో ఉంటాను. 'సీరం'లో ఉండను. 'గేయం'లో ఉంటాను. 'గేదె'లో ఉండను. 'తంత్రం'లో ఉంటాను. 'తంతు'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

who I Am

నేనో నాలుగక్షరాల పదాన్ని. 'అల’లో ఉంటాను. 'కల'లో ఉండను. 'యోగం'లో ఉంటాను. ‘భాగం’లో ఉండను. ‘మర’లో ఉంటాను. 'అర’లో ఉండను. ‘మాయం’లో ఉంటాను. 'మాయ'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?