Skip to main content

Posts

సామెతలు

1. అడిగే వాడికి చెప్పేవాడు _ _ _ . 2. ఎవరికి వారే _ _ _ తీరే. 3. అమ్మబోతే _ _ _ కొనబోతే కొరివి. 4. చల్లకు వచ్చి _ _ దాచినట్లు. 5. _ _ వాక్కు బ్రహ్మ వాక్కు.

నేనెవర్ని

నేనెవర్ని? ఆరు అక్షరాల పదాన్ని నేను. ‘సగం’లో ఉంటాను కానీ 'వేగం'లో లేను. 'మట్టి'లో ఉంటాను కానీ 'గట్టి'లో లేను. 'దయ’లో ఉంటాను కానీ 'గద’లో లేను. 'పాట'లో ఉంటాను కానీ 'ఆట'లో లేను. 'లవం'లో ఉంటాను కానీ 'ద్రవం'లో లేను. 'నలుగు’లో ఉంటాను కానీ 'పలుగు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

పొడుపు కథలు

పొడుపు కథలు 1. ఒకవైపు తిప్పితే దారిని తెరుస్తుంది.. మరోవైపు తిప్పితే దారిని మూసేస్తుంది. అదేంటి? 2. గాజు కోటలో మిణుగురు పురుగు.. పగలేమో నిద్రపోతుంది.. చీకటి పడగానే మేల్కొంటుంది. ఏంటబ్బా? 3. బంగారు పెట్టెలో దాగిన ముత్యం. ఏంటో తెలిసిందా?

Relationship ఏమిటి

రాజన్ ఒక అమ్మాయి వైపు చూపిస్తూ, ఆమె నా తల్లి కుమార్తె అని చెప్పాడు. మరి ఆ అమ్మాయికి రాజన్కి సంబంధం ఎలా ఉంది? A. కూతురు B. మేనకోడలు C. మేనల్లుడు D. మామ బి. మేనకోడలు

Who I Am?

1. ఆరు అక్షరాల పదాన్ని నేను. 'గోరు’లో ఉంటాను కానీ 'గోల’లో లేను. 'తుమ్ము'లో ఉంటాను కానీ 'దమ్ము'లో లేను. ‘పని’లో ఉంటాను కానీ 'గని’లో లేను. 'వనం’లో ఉంటాను కానీ ‘జనం’లో లేను. ‘నాటు’లో ఉంటాను కానీ 'గీటు'లో లేను. ‘విలువ’లో ఉంటాను కానీ 'వివరం'లో లేను. నేనెవరినో తెలిసిందా? 2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'కత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను. 'లత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను. 'వల'లో ఉంటాను కానీ 'అల'లో లేను. 'నరం'లో ఉంటాను కానీ 'శునకం'లో లేను.