చెప్పుకోండి చూద్దాం
ముగ్గురు వర్తకుల్ని అడవిలో నలుగురు దొంగలు పట్టుకొని పోతున్నారు. ఇంతలో "చంపుతా, మింగుతా" అంటూ ఒక భూతం ఎదురైంది. మొదటివాడు చాలా తెలివైనవాడు. భూతంతో ఇలా అన్నాడు "భూతమా! మేము ఏడుగురం వరుసలో నిలబడతాము. మొదటి నుండి ప్రతి 4 వ వాణ్ణి లెక్కపెట్టి తిను. వంతు వచ్చిన మొదటి నలుగుర్ని తిని నీదారిన నీవుపో". భూతం సరే అంది. వర్తకుడు ఏడుగుర్ని ఒక వరుసలో నిలబెట్టాడు. భూతం ప్రతి నాలగవ వాణ్ణి లెక్క పెట్టి తినేసింది : నాలుగుసార్లు దొంగల వంతే వచ్చింది. ఒక్క దెబ్బన దొంగలు, భూతం రెండిం పీడ వదలించుకున్నాడు వర్తకుడు. ఇందులో అతడు వరుస ఎలా ఏర్పాటు చేశాడు?
Comments
Post a Comment