👉1. మే నెలలో పుట్టిన నత్త ?
జవాబు: మేనత్త!
👉2. దుర్గకి పట్టిన గతి ?
జవాబు: దుర్గతి!
👉3. కోడి కాని కోడి ?
జవాబు: పకోడి
👉4. పండు కాని పండు ?
జవాబు: విభూది పండు!
👉5. కాయ గాని కాయ ?
జవాబు: తలకాయ్!
👉6. హారం గాని హారం?
జవాబు: ఫలహారం!
👉7. పురం గాని పురం?
జవాబు: కాపురం!
👉8. దానం గాని దానం?
జవాబు: మైదానం!
👉9. మామ గాని మామ?
జవాబు: చందమామ!
👉10. రసం గాని రసం?
జవాబు: నీరసం
👉11. రాజు గాని రాజు
జవాబు: తరాజు
👉12. కారం కాని కారం
జవాబు: ఉపకారం
👉13. రాగి కాని రాగి
జవాబు: బైరాగి
👉14. కోడి కాని కోడి
జవాబు: పకోడీ
👉15. తారు కాని తారు
జవాబు: జలతారు
👉16. మామ కాని మామ
జవాబు: చందమామ
👉17. తాళి కాని తాళి
జవాబు: ఎగతాళి
👉18. దారా కాని దార
జవాబు: పంచదార
👉19. నత్త కాని నత్త
జవాబు: మేనత్త
👉20. జనము కాని జనము
జవాబు: భోజనము
👉21. రాయి కాని రాయి
జవాబు: కిరాయి
👉22. నాడ కాని నాడ
జవాబు: కాకినాడ
👉23. టూరు గాని టూరు
జవాబు: గుంటూరు
👉24. రెంటు గాని రెంటు
జవాబు: కరెంటు.
👉25. మొగ్గ కాని మొగ్గ
జవాబు: పిల్లి మొగ్గ
26. కాయ కాని కాయ
జవాబు: తలకాయ
👉27. దేహం గాని దేహం
జవాబు: సందేహం
👉28. హారం కాని హారం
జవాబు: వ్యవహారం
👉29. శిక్ష గాని శిక్ష
జవాబు: బాల శిక్ష
👉30. దేశం గాని దేశం
జవాబు: సందేశం
👉31. తార కాని తార
జవాబు: సితార
👉32. దారం గాని దారం
జవాబు: మందారం
👉33. కీలు కాని కీలు
జవాబు: వకీలు
👉34. సందు కాని సందు
జవాబు: పసందు
👉35. పాలు కాని పాలు
జవాబు: కోపాలు
👉36. కారు గాని కారు
జవాబు: షావుకారు
👉37. కులం కానీ కులం
జవాబు: గురుకులం
👉38. గోళం కాని గోళం
జవాబు: గందరగోళం
👉39. పతి కాని పతి
జవాబు: తిరుపతి
👉40. కట్టు గాని కట్టు
జవాబు: తాకట్టు
👉41. దారి కాని దారి
జవాబు: గోదారి
👉42. వెల కాని వెల
జవాబు: కోవెల
👉43. దేశం కాని దేశం
జవాబు: సందేశం
👉44. బడి కాని బడి
జవాబు: రాబడి
👉45. మత్తు కాని మత్తు
జవాబు: గమ్మత్తు
👉46. వరం కాని వరం
జవాబు: కలవరం
👉47. తాళం కాని తాళం
జవాబు: పాతాళం
👉48. మాట కాని మాట
జవాబు: టమాట
👉49. రాణి కాని రాణి
జవాబు: పారాణి
👉50. గ్రహం కాని గ్రహం
జవాబు: అనుగ్రహం
👉51. మందు కాని మందు
జవాబు: కామందు
👉52. కాయ కాని కాయ
జవాబు: మెడకాయ
👉53. గొడుగు కాని గొడుగు
జవాబు: పుట్టగొడుగు
👉54. కాగితాలు చింపుతాడు కానీ పిచ్చోడు కాదు, అడుక్కుంటాడు కాని బిచ్చగాడు కాదు.. ఎవరతను?
జవాబు: కండక్టర్
👉55. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్క లాడింది, ఏమిటది?
జవాబు: కవ్వం!
Comments
Post a Comment