చిలిపి ప్రశ్నలు
1. ఇది ఐదక్షరాల పదం. దీనికి రెండు అక్షరాలు కలిపితే మరింత పొట్టిగా అవుతుంది.
జ) SHORT(er)
2. బుధ, శుక్ర, ఆదివారాలు వాడకుండా వరుసగా వచ్చే మూడు రోజుల పేర్లు చెప్పండి.
జ) నిన్న, ఇవాళ, రేపు
3. వాడుతుంటే మిగతావి పనిచేయడం తగ్గుతాయి. కానీ ఇది ఎక్కువగా పనిచేస్తుంది.
జ) మెదడు
4. అది నేదే . కానీ నీకంటే ఎక్కువగా ఇతరులు వాడుతారు.
జ) నీ పేరు
5. నా పేరు పలకనంత వరకు నేనుంటా. పలికితే ఉండను జ) నిశ్శబ్దం
6) ఒక ఆసామికి 9 బర్రెలు ఉన్నాయి. ఒకటో బర్రె ఒక శేరు రెండోది రెండు శేర్లు, మూడోది మూడు ఇలా తొమ్మిదో బర్రె 9 శేర్లు పాలిచ్చేవి. ఆ ఆసామి తన ముగ్గురు కొడుకులకు మూడేసి బర్రెల చొప్పున పంచి ఇచ్చాడు. అంతే కాదు, ఒక్కొక్కనికి వచ్చిన మూడు బర్రెలు ఇచ్చే పాలు కూడా సమానమే. అతడు ఎలా పంచాడు?
జ) ఈ పక్క చదరంలో ఒక్కొక్క గడి ఒక బఱ్ఱె అనుకుందాము. అది ఇచ్చేపాలు ఆ గడిలోనే అంకెల్లో చూపాము. ఒకొక్కని వంతుకు మూడు బర్రెలు, 15 శేర్ల పాలు వచ్చాయి. 8 1 6 ------->15 శేర్లు; మూడేసి 3 5 7----->15 శేర్లు; బర్రెలు 4 9 2 -------> 15 శేర్లు
Comments
Post a Comment