వాక్యాల్లో ప్రాంతాల పేర్లు
ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల పేర్లు దాగున్నాయి. అవేంటో కనుక్కోండి.
1. తాను నా స్నేహితురాలు విజయ. వాడవాడలా తిరుగుతూ ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కల్పిస్తుంటుంది.
2. అలా నీరసంగా.. రెడ్డి హోటల్లో పడిగాపులు కాసే బదులు, నేరుగా ఇంటికే రావొచ్చు కదా!
3. పెద్ద పిడుగు, రాళ్ల వర్షం కారణంగా మా పక్క ఊరిలో విషాదం అలుముకుంది.
4. మా మిత్రురాలు శుభమంగళ.. గిరి ప్రదక్షిణ చేసి వచ్చేవరకూ.. మేమంతా గుడి బయటే షాపింగ్
చేశాం.
5. మనిషన్నాక నిలకడ, పరువు చాలా అవసరం.
6. నువ్వు నా బంగారు కొండ. గట్టు మీదే జాగ్రత్తగా కూర్చొని చూస్తూ ఉండు. సరేనా!
Comments
Post a Comment