Answer:
ప్రశ్న ఆకుకూరలు మరియు కూరగాయలకుసంబంధించినది మరియు సరైన సమాధానాలు:
1. ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర
2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర
3. కాగితం చుడితే వచ్చే కూరగాయ
4 సమస్యలలో వున్న కూరగాయ
5. రెండు అంకెతో వచ్చే కూరగాయ
6.దారి చూపించే కూరగాయ
7. తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ
8. కష్టాలలో వున్న కూరగాయ
9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర
10. సగంతో మొదలయ్యే కూరగాయ
11. నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర
12. వనంలో వున్న ఆకుకూర
13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర
14. మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ
15. చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ
👉 జవాబులు -
(1). ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర ... గోంగూర
2. నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర ... చుక్క కూర
3. కాగితం చుడితే వచ్చే కూరగాయ... పోట్ల కాయ
4. సమస్యలలో వున్న కూరగాయ... చిక్కుడు కాయ
5. రెండు అంకెతో వచ్చే కూరగాయ.... దొండ కాయ
6. దారి చూపించే కూరగాయ ... Beetroot
7 తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ... కీ రదోస కాయ
8. కష్టాలలో వున్న కూరగాయ ... చిక్కుడు కాయ
9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర ... బచ్చలకూర
10.సగంతో మొదలయ్యే కూరగాయ ... అరటికూర
11 నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర ... గోంగూర/కొయ్య తోటకూర
12 వనంలో వున్న ఆకుకూర ... తోట కూర
13. ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర ... కరివేపాకు
14 మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ ... టమోట
15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ... క్యారెట్
16జలచరంతో వున్న కూరగాయ ... సొర కాయ
Comments
Post a Comment