ఈ క్రింది ప్రతి వాక్యంలో మూడేసి "జీవులు" దాక్కున్నాయి.కనిపెట్టండి చుద్దాం
1). ఏది ఏమైనా ఈ ఉల్లిపకోడి వాసనకు ఆవులింతలాగిపోతాయి.
2). తుపాకి పేలుస్తానని ఖాసిం హంగామా చేసింది ఇప్పుడే గదా.
3). కిషోర్ గాడి దర్పం, కోపం దినందినం పెరుగుతున్నాయి.
4). నీతూ! నీ గదిలోనే ఏదో మందమతిలా ఏకాకిగా కూర్చోకు.
5). మేకప్ తీసేసి కుక్కర్ పెట్టేస్తే ఈ రోజింక పని లేనట్లే.
6). మా మేనత్త ఈ గదిలో వాచీ మర్చిపోయింది.
Comments
Post a Comment