నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'మూసీ'లో ఉన్నాను కానీ 'మూస'లో లేను. 'తాటి'లో ఉన్నాను కానీ 'కోటి'లో లేను. 'ఫణి'లో ఉన్నాను కానీ 'మణి'లో లేను. 'బలం'లో ఉన్నాను కానీ 'బల్లి'లో లేను. ఇంతకీ నేనెవర్ని?చెప్పుకోండి చూద్దాం?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'కుండ'లో ఉన్నాను. కానీ 'బండ'లో లేను. 'దేహం'లో ఉన్నాను కానీ 'దాహం'లో లేను. 'వేలు'లో ఉన్నాను కానీ 'వేరు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా? చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment