Skip to main content

దీపారాధన ఫలితాలు


👉 దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి

👉 దేవతారాధన చేయుటకు ముందు ఒక వైపు ఆవు నేతితో, మరొక వైపు నువ్వుల నూనె తో దీపరాదన చేయవలెను. వీటిని సుదర్శన, పాశుపతములు అని పిలుస్తారు.

👉 వెండి కుందులు, పంచ లోహ కుందులు మంచివి. మట్టి కుందులు మాద్యమము.

👉 👉 దీపం లో వేసే నూనె వలన కలుగు ఫలితాలు 

👉 నెయ్యి -------- లక్ష్మి కటాక్షం(ఆవు నెయ్యి, పిప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది.)

👉 ఆముదం ------కస్టాలు తొలుగుట(చేస్తే ఏకాగ్రత ,కీర్తి ప్రతిష్టలు, స్నేహితులు పొందుతారు)

👉 నువ్వులనూనె ------ మద్యమం(దుష్ట శక్తి భాధలు, శత్రు బాధలు తోలుగుతాయి)

👉గమనిక: వేరుశనగ నూనె మొదలైన తక్కువరకం నూనెలతో ఆరాధన చెయ్యరాదు .

👉 దీపం ఈ దిశలో ఉండవలెను

తూర్పు -----కస్టాలు తీరి మంచి జరుగును
పడమర ---- గ్రహ దోషం పోవును ,
అన్నదమ్ముల మద్య పగ చల్లరును
ఉత్తరం ----- విద్య ,సుభాకార్యములు మంచిగా జరుగును
దక్షిణం ---- అపసకునం

👉 శివుడికి ఎడమవైపు దీపారాధన చెయ్యాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చెయ్యకూడదనీ అంటారు.
అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దానిమాద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.
ఇంటిముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
శనీశ్వరుడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల నవ్వులు పోసి మూటకట్టి, ఆమూట చివర వత్తిగా చేసి, ఇనప ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చెయ్యాలి. ఈ దీపారాధనకూడా శివుడు, శనీశ్వరుడు, ఆంజనేయస్వామి ముందుచేసి శని దోషాలు పోవాలని నమస్కరించాలి

👉 దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు

స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించారాదు.(అగరావత్తులు, ఎకహరతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచినప్పుడు దీపారాదన నుండి వేలిగించ రాదు.)
ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి.
దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగ దీపాన్ని ఉంచరాదు.
దీపం కొండెక్కితే "ఓమ్ నమః శివాయ " అని 108 సార్లుజపించి దీపం వెలిగించాలి.

👉 ఉదయం పూట దీపారాదన చేసినప్పుడు చెప్పవలసిన శ్లోకం


భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షిహ్య విఘ్నకృతే


యావత్ పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరోభవ!

దీపారాధన ముహుర్తః సుముహుర్తోస్తు అని పువ్వు పెట్టి,అక్షితలు వేయాలి



మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను "వ్యష్టి " దీపారాధన అంటారు.

తులసి కోట వద్ద చేసే దీపారాధనని " బృందావన" దీపారాధన అంటారు.


రెండు కుందులూ- ఒక్కో దాంట్లో మూడేసి ఒత్తుల్ని వేసి ఆరాధిస్తున్నాను. సరేనా?
సరైనదే. ఏదైనా సరిసంఖ్యలో (ఆలుమగలు అన్నదమ్ములు అప్పచెల్లెళ్లు... ఇలా) ఉండాలి. దానిలో బేసి సంఖ్యతో ఆరాధించాలి.
రాహుకాల దీపం గురించి చెప్పగలరు. 
జాతకంలో రాహుదోషం ఉన్న పక్షంలో ప్రతిదినం వచ్చే రాహుకాలంలో రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి 18 గుణకాలలో (36, 54, 72, 90...) ఇలా ఆ స్తోత్రాన్ని రాహుకాలం ఉండే 90 నిమిషాలసేపూ పారాయణం చె య్యాలి.

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి