నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'బరువు'లో ఉంటాను కానీ 'అరువు'లో లేను. 'రాహువు'లో ఉంటాను కానీ 'రావు'లో లేను. 'మతి'లో ఉంటాను. కానీ 'అతి'లో లేను. 'తిక్క'లో ఉంటాను కానీ 'నక్క'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను అయిదు అక్షరాల పదాన్ని. 'అవ్వ'లో ఉంటాను కానీ 'బువ్వ'లో లేను. 'లంచం'లో ' ఉంటాను కానీ 'కంచం'లో లేను. 'కత్తి'లో ఉంటాను. కానీ 'సుత్తి'లో లేను. 'రవ్వ'లో ఉంటాను కానీ 'మువ్వ'లో లేను. 'గణన'లో ఉంటాను కానీ 'నగ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment