1. నేనో అయిదక్షరాల పదాన్ని. 'మామ'లో ఉంటాను. ` దోమ ' ఉండను. 'స్వామి'లో ఉంటాను. 'స్వారీ'లో ఉండను. 'మేడి'లో ఉంటాను. 'మేలు'లో ఉండను. 'పాపం'లో ఉంటాను. 'పార'లో ఉండను. 'గోడు'లో ఉంటాను. ' గోడ ' ఉండను. ఇంతకీ నేనెవర్ని? చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'వల'లో ఉంటాను. 'కల'లో ఉండను. 'మేడ'లో ఉంటాను. 'మేకు'లో ఉండను. 'గాజు'లో ఉంటాను. 'రాజు'లో ఉండను. 'లలిత'లో ఉంటాను. 'లత'లో ఉండను. నేనెవరో
చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment