ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని కీటకాల పేర్లు దాగున్నాయి. అవేంటో వెతికి కనిపెట్టండి చూద్దాం.
1. కొరియర్లో వచ్చిన ఆ బహుమతి ఎవరిదో.. మన మురారికే తెలియాలి.
2. నల్లమల అడవులకు ఆనుకొని ఉండే ఈగలపెంట గ్రామం వద్ద కృష్ణా నది అందాలను వర్ణించలేం.
3. అగ్గితెగులు, పేనుబంక.. పంటలకు వచ్చే ఈ తెగుళ్ల పేర్లన్నీ వ్యవసాయంతో అనుబంధం ఉన్నవాళ్లకే తెలుస్తాయి.
4. చెల్లి ఎందుకు పేచీ.. మనిద్దరం కలిసి బయటకు వెళ్లివద్దాం పద..
Comments
Post a Comment