1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'శుద్ధి'లో ఉంటాను కానీ 'బుద్ధి'లో లేను. 'క్రమం'లో ఉంటాను కానీ 'భ్రమం'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'రంపం'లో ఉంటాను కానీ 'భూకంపం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'గుక్క'లో ఉంటాను కానీ 'కుక్క'లో లేను. 'లాఠీ'లో ఉంటాను కానీ 'ఠీవీ' లో లేను. 'బీర'లో ఉంటాను కానీ 'సొర'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'శుభం'లో ఉంటాను కానీ 'లాభం'లో లేను. 'క్రయం'లో ఉంటాను కానీ 'భయం'లో లేను. 'వాత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను. 'రంపంలో ఉంటాను కానీ 'కోపం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. మూడు అక్షరాల పదాన్ని నేను. 'అర'లో ' ఉంటాను కానీ 'కర'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'పుణ్యం'లో ఉంటాను కానీ 'పురం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment