నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అమ్మ'లో ఉంటాను కానీ 'కొమ్మ'లో లేను. 'వల'లో ఉంటాను కానీ 'కల'లో లేను. 'తారు'లో ఉంటాను కానీ 'బోర్డు'లో లేను. 'నరం'లో ఉంటాను కానీ 'నయం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'సత్యం'లో ఉంటాను కానీ 'నిత్యం'లో లేను. 'మసి'లో ఉంటాను కానీ 'కసి'లో లేను. 'లాస్య'లో ఉంటాను కానీ 'లాఠీ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
3. రెండు అక్షరాల పదాన్ని నేను. 'బొమ్మ'లో ఉంటాను కానీ 'కొమ్మ'లో లేను. 'అట్టు'లో ఉంటాను ''కానీ 'అట్ట'లో లేను. నేనెవర్ని?
Comments
Post a Comment