నేనెవర్ని? ఆరు అక్షరాల పదాన్ని నేను. ‘సగం’లో ఉంటాను కానీ 'వేగం'లో లేను. 'మట్టి'లో ఉంటాను కానీ 'గట్టి'లో లేను. 'దయ’లో ఉంటాను కానీ 'గద’లో లేను. 'పాట'లో ఉంటాను కానీ 'ఆట'లో లేను. 'లవం'లో ఉంటాను కానీ 'ద్రవం'లో లేను. 'నలుగు’లో ఉంటాను కానీ 'పలుగు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
రాజన్ ఒక అమ్మాయి వైపు చూపిస్తూ, ఆమె నా తల్లి కుమార్తె అని చెప్పాడు. మరి ఆ అమ్మాయికి రాజన్కి సంబంధం ఎలా ఉంది? A. కూతురు B. మేనకోడలు C. మేనల్లుడు D. మామ బి. మేనకోడలు
1. ఆరు అక్షరాల పదాన్ని నేను. 'గోరు’లో ఉంటాను కానీ 'గోల’లో లేను. 'తుమ్ము'లో ఉంటాను కానీ 'దమ్ము'లో లేను. ‘పని’లో ఉంటాను కానీ 'గని’లో లేను. 'వనం’లో ఉంటాను కానీ ‘జనం’లో లేను. ‘నాటు’లో ఉంటాను కానీ 'గీటు'లో లేను. ‘విలువ’లో ఉంటాను కానీ 'వివరం'లో లేను. నేనెవరినో తెలిసిందా? 2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'కత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను. 'లత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను. 'వల'లో ఉంటాను కానీ 'అల'లో లేను. 'నరం'లో ఉంటాను కానీ 'శునకం'లో లేను.
పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయాలా? సంఖ్యా లాక్‌లో 3 అంకెల కీ ఉంటుంది Hints. 682 - ఒక సంఖ్య సరైనది మరియు బాగా ఉంచబడింది 614 - ఒక నంబర్ సరైనది కానీ తప్పుగా ఉంచబడింది 206 - రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పుగా ఉంచబడ్డాయి 738 - ఏదీ సరైనది కాదు 780 - ఒక నంబర్ సరైనది కానీ తప్పుగా ఉంచబడింది
* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి
ఒక వ్యక్తి ఒక మహిళతో, "మీ తల్లి భర్త సోదరి నా తల్లి" అని చెప్పాడు. స్త్రీకి మనిషికి ఎలా సంబంధం ఉంది. A. బంధువు B. సోదరుడు C. కొడుకు D. మేనల్లుడు ఎ. బంధువు
రాముడు రాజూ సోదరుడు, రాజూ సోదరికి రత్న ఒక్కగానొక్క కొడుకు. రత్న రాముడి కుమార్తెను వివాహం చేసుకుంది. రత్న కూతురైన రామ, రజనిల మధ్య సంబంధం ఏమిటి? ➡️ మామ - మేనకోడలు ➡️ తండ్రి - కూతురు ➡️ తాత - మనవరాలు ➡️ తాత - మనవడు
కింద కొన్ని పదాలున్నాయి. అందులో ఒకటి మాత్రం, మిగతా వాటికి భిన్నంగా ఉంది. అవేంటో కనిపెట్టండి. 1. చిలగడదుంప, ఆలుగడ్డ, సొరకాయ, క్యారెట్ 2. ఉంగరం, గాజులు, కంకణం, పట్టీలు 3. కందిపప్పు, గన్నేరుపప్పు, మినప పప్పు, పెసరపప్పు 4. వాలీబాల్, చదరంగం, అష్టాచమ్మా, క్యారమ్స్
ఐదక్షరాల ఊరి పేరు..ఒకటీ ఐదు కలిపితే కూర వండుకోవచ్చు , కూస్తుందికూడా, ఒకటీ మూడూకలిపితే స్పృహలోలేనట్లే, రెండూ మూడు లకు "లు" కలిపితే మొహం తుడుచుకోవచ్చు , మూడూ నాలుగు ఐదూ కలిపి పప్పు గాని పచ్చడి గాని చేసుకోవచ్చు...పండు కూడా తినొచ్చు,నాలుగు ఐదూ మళ్ళీ రిపీట్ చేస్తే ...ఈ జ్ఞానం అంటారు. ఒకటీ రెండూ కలిపి భగవంతుణ్ణి ఏదైనా వరం అడగొచ్చు ...ఆ ఊరి పేరేమిటి ? Answer : కోరుమామిడి
ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే, కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. సి _ పే _ 2. _ ర్నూ _ 3. త _ కు 4. _ ద _ 5. తి _ ప _ 6. _ శై _ 7. ని _ ల్ 8. _ జ _ వా _