నేనెవర్ని?
1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'చలనం’లో ఉన్నాను కానీ 'ప్రజ్వలనం'లో లేను. 'బలి'లో ఉన్నాను కానీ 'బరి'లో లేను. 'చీము’లో ఉన్నాను కానీ ‘నోము’లో లేను. 'మట్టి'లో ఉన్నాను కానీ ‘బట్టి'లో లేను. ‘రైలు’లో ఉన్నాను కానీ 'రైతు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను ఆరు అక్షరాల పదాన్ని. 'అంజి'లో ఉన్నాను కానీ 'గంజి'లో లేను. 'తరాజు'లో ఉన్నాను కానీ 'రారాజు'లో లేను. 'సిరి'లో ఉన్నాను కానీ 'పసి’లో లేను. 'క్షమ'లో ఉన్నాను కానీ 'దోమ’లో లేను. 'యాత్ర'లో ఉన్నాను కానీ 'మాత్ర'లో లేను. 'నంది'లో ఉన్నాను కానీ 'కంది'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment