1) కుప్పకు ముందు, కుస్తీకి వెనుక
2) కుమ్మరవీధిలో కుండ లమ్మినట్లు
3) కులం కన్నా గుణం ప్రధానం
4) కులం చెడినా గుణం దక్కవలె
5) కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందట!
6) కూచిపూడిలో కుక్క మొరిగినా సంగీతమే
7) కూటికి గతి లేదుగాని కుంటెనలకు ముత్యాలు
8) కూటికి తక్కువైనా కులానికి తక్కువా?
9) కూటికోసం కోటి విద్యలు
10) కూడు ఉంటే కూలగోత్రా లెందుకు?
11) కూడు ఉడుకలేదని కుండట్టుక కొట్టాడట!
12) కూర లేని తిండి కుక్క తిండి
13) కూర్చుంటే కుంటి, లేస్తే లేడి
14) కూర్చుంటే లేవలేడుగాని, ఎగిరెగిరి తంతాడట
15) కూర్చుండి తింటూఉంటే కొండయినా కరిగిపోతుంది
16) కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్లు
17) కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచిందట!
18) కొంటే రానిది, కొసరితే వస్తుందా?
19) కొండంత తెలివి కంటే గోరంత కలిమి మేలు
20) కొండంత చీకటి - గోరంత దీపం
21) కొండను చూచి కుక్కలు మొరిగినట్లు
22) కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
23) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
24) ఇంటి పేరు కస్తూరివారు - ఇంట్లో గబ్బిలాల కంపు.
25) ఇంటికన్నా గుడి పదిలం.
26) ఇంట గెలిచి - రచ్చ గెలువు
27) ఇంటిగుట్టు పెరుమాళ్ళకెరుక
28) ఇంటి దీపమని ముద్దుపెట్టుకుంటే మీసాలన్నీ తెగ కాలినట్లు.
29) ఇంట్లో ఇల్లాలి పోరు - బయట బాకీల హోరు.
30) ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీల మోత.
31) ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది.
33) ఇంట్లో పిల్లి - బయట పులి.
34) ఇంట్లో ఇగురు కూరకంటే పొరుగింటి పుల్లకూర రుచి.
35) ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.
36) ఇంటి గుట్టు - లంకకు చేటు.
37) ఇంటి కుక్కకు ఇంటి కుక్క పనికిరాదు.
38) ఇంటికి ఒక పువ్వు - ఈశ్వరుడి కొక మాల
39) ఇంటాయనకు మగతనముంటే పొరుగింటాయన పొందెందుకు? అందిట
40) అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు
41) అందితే సిగ...అందకపోతే కాళ్లు
42) అమ్మబోతే అడివి... కొనబోతే కొరివి
43) అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు?
44) అయ్యవారిని చెయ్యబోతే కోతి అయింది...
45) అరచేతిలో వైకుంఠం చూపినట్లు
46) అంధునకు అద్దం చూపినట్లు
47) మొగుడు మొట్టితే ఏడవలేదు గాని, తోడికోడలు నవ్విందని ఏడిచిందట
48) ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి
కట్టినట్లు
49) ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు ವಏ!
50)పిట్టకొంచెం కూత ఘనం.
51) కాకి పిల్ల కాకికి ముద్దు.
52) గోరంత దీపం కొండంత వెలుగు.
53) దూరపు కొండలు నునుపు.
54)పోరు నష్టం పొత్తు లాభం.
55) పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
56)మనసుంటే మార్గం ఉంటుంది.
57)కోటి విద్యలు కూటి కొరకే.
58) సంతోషమే సగం బలం.
59) నిదానమే ప్రధానం.
60) చెప్పటం కంటే చేయడం మేలు.
61) నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
62) నీరు మంచిదయితే ఊరు మంచిదవు
Comments
Post a Comment