నేనెవర్ని?
(1). నేనో అయిదు అక్షరాల పదాన్ని.
తులంలో ఉంటాను. హలంలో ఉండను.
అలలో ఉంటాను. అరలో ఉండను.
సిరలో ఉంటాను. ధరలో ఉండను.
కోటిలో ఉంటాను. తోటిలో ఉండను.
మేటలో ఉంటాను. మేడిలో ఉండను.
ఇంతకీ నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం?
(2). నేనో నాలుగు అక్షరాల పదాన్ని.
చిలుకలో ఉంటాను. ఎలుకలో ఉండను.
రుషిలో ఉంటాను. కృషిలో ఉండను.
జీతంలో ఉంటాను.గతంలో ఉండను.
రావిలో ఉంటాను. రాయిలో ఉండను.
ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
తులసికోట
ReplyDeleteచిరుజీవి
ReplyDelete