నా పేరు చెప్పుకోండి చూద్దాం.
1. అయిదక్షరాల తెలుగు పదాన్ని నేను.
‘మంత్రి'లో ఉంటాను. కానీ ‘కంత్రి'లో ఉండను.
'దానం'లో ఉంటాను. కానీ 'మనం'లో ఉండను.
'రణం'లో ఉంటాను. కానీ 'కణం'లో ఉండను.
‘పుత్తడి'లో ఉంటాను. కానీ ‘ఇత్తడి'లో ఉండను.
'నవ్వు'లో ఉంటాను. కానీ 'నస'లో ఉండను.
ఇంతకీ నేనెవరినో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం?
2. నేనో నాలుగు అక్షరాల పదాన్ని.
'తార'లో ఉంటాను. కానీ 'పార'లో ఉండను.
'మేళం'లో ఉంటాను. కానీ 'మేత'లో ఉండను.
'చెత్త’లో ఉంటాను. కానీ 'అత్త’లో ఉండను.
‘బావి'లో ఉంటాను. కానీ ‘బాట'లో ఉండను.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment