Skip to main content

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు కనుక్కోండి చూద్దాం

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు కనుక్కోండి చూద్దాం 

ఈ వాక్యాల్లో కొంత మంది వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను ఓ చోట చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?

1. ఈ చలిలో వణుకుతూ వచ్చే బదులు నిదానంగా సూర్యుడు వచ్చాకే రావొచ్చుగా తాత.

2. సరిగ్గా చదవకుంటే.. వీపు విమానం మోత మోగుతుంది.

3. ఒక్క నిమిషం ఆగి వింటే తెలుస్తుంది.. సరిగమల గొప్పతనం.

4. ఇటు రా.. కాస్త ఆ గాజు బొమ్మ నెమ్మదిగా చేతికి అందివ్వు.

5. కదలకుండా ఉండు.. చేతి మీద వాలింది పే..ద్ద దోమ. అసలేంటో వీటి గోల.

Answer.
1. వనిత

2. సరిత

3. గిరి

4. రాజు

5. కమల

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి