1. నేనో నాలుగు అక్షరాల పదాన్ని.
'కంచం'లో ఉంటాను. కానీ 'కలం'లో లేను.
'దశలో ఉంటాను. కానీ 'దిశలో లేను.
'మాసం'లో ఉంటాను కానీ 'మాంసం'లో లేను.
'మనం'లో ఉంటాను. కానీ 'వనం'లో లేను.
ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. అయిదక్షరాల పదాన్ని నేను.
'దారం'లో ఉంటాను. కానీ 'కారం'లో ఉండను.
'నిజం'లో ఉంటాను కానీ 'గజం'లో ఉండను.
'కొమ్మ'లో ఉంటాను. కానీ 'కొత్త'లో ఉండను.
'కాలం'లో ఉంటాను. కానీ 'వేలం'లో ఉండను.
‘యమున'లో ఉంటాను. కానీ 'జమున'లో ఉండను.
నేనెవర్ని?
Comments
Post a Comment