1. నేనో మూడక్షరాల పదాన్ని.
'సంత’లో ఉంటాను. 'పుంత'లో ఉండను.
'గీటు'లో ఉంటాను. 'గాటు'లో ఉండను.
'గతం'లో ఉంటాను. 'గళం'లో ఉండను.
ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగక్షరాల పదాన్ని.
'తెప్ప'లో ఉంటాను. 'కప్ప'లో ఉండను.
'రవి'లో ఉంటాను. 'కవి'లో ఉండను.
'చారు'లో ఉంటాను. 'కారు'లో ఉండను.
'పది'లో ఉంటాను. 'మది'లో ఉండను.
ఇంతకీ నేనెవర్నో తెలుసా?
Comments
Post a Comment