1. నేనో మూడక్షరాల పదాన్ని.
'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.
'తోరణం'లో ఉంటాను. 'కారణం'లో ఉండను.
'విషం'లో ఉంటాను. 'విరి'లో ఉండను.
ఇంతకీ నేనెవర్ని?
2. నేను నాలుగక్షరాల పదాన్ని.
'బావి'లో ఉంటాను. 'భావి'లో ఉండను.
'తోట'లో ఉంటాను. 'తోక'లో ఉండను.
'సాయం'లో ఉంటాను. 'గాయం'లో ఉండను.
'కరి'లో ఉంటాను. 'కవి'లో ఉండను.
ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment