Skip to main content

తెలుగు సామెతలు

తెలుగు సామెతలు

1). కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు.

2). అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడట.

3). అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట.

4). పేనుకు పెత్తనం ఇస్తే తల గొరికి పెట్టిందంట.

5). ఆస్తి మూరెడు ఆశ బారెడు.

6). పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం.

7). ఇల్లలకగానే పండగ కాదు.

8). అందితే జుట్టు అందక పోతే కాలు.

9). చెవిటి వాని ముందు శంఖమూదినట్టు.

10). పిట్ట కొంచెం కూత ఘనం.

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి