Skip to main content

Posts

Last లో కాయ అనే పదం వస్తాయి

ఇక్కడ ఉన్న ప్రశ్నలకు బాగా ఆలోచించి, సరైన జవాబులు చెప్పండి చూద్దాం. 1. దీపావళికి పేల్చేది? 2. కోపం వస్తే ఎదుటివారికి ఇచ్చేది? 3. మన ప్రాణానికి ఆధారమైంది? 4. చిన్నారులు ఆడుకునేది? 5. పొట్టలో తీపి ఉండే పిండి వంటకం? 6. బడిలో టీచర్లు ఇచ్చేది? 7. ఎక్కువ మాట్లాడేవారిని ఇలాగంటారు. 8. తప్పు చేస్తే ఇది లేదంటారు. 9. చేతులకు ముళ్లు, పొట్టలో పళ్లు దాచుకున్నదేది? 10. తల కింద ఉండేది ?

గజి బిజి గా ఉన్నాయి సరి చేయండి

గజిబిజి బిజిగజి! ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి. 1. జుమరాహా 2. మామంరదాల 3. యివుపారా 4. రంరతీగసా 6. యకారపమి 7. మియిచుపీఠా 8. ఇంవతారవా

ఆ అమ్మాయి ఏమని చెప్పింది

👉అబ్బాయి 143 అని చెప్పాడు, 👉అమ్మాయి 25519 అని ప్రత్యుత్తరం ఇచ్చింది,  👉అంకెలను ట్రేస్ చేయండి లేదా 👉వారు ఒకరికొకరు ఏమి చెప్పుకుంటారు?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'శుభం'లో ఉంటాను కానీ 'లాభం'లో లేను. 'క్రయం'లో ఉంటాను కానీ 'భయం'లో లేను. 'వాత'లో ఉంటా కానీ 'కోత'లో లేను. 'రంపం'లో ఉంటాను. కానీ 'కోపం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. మూడు అక్షరాల పదాన్ని నేను. 'అర'లో ఉంటాను కానీ 'కర'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'పుణ్యం'లో ఉంటాను కానీ 'పురం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. నేను అయిదక్షరాల పదాన్ని. 'అల'లో ఉంటాను. `వల'లో ఉండను. `రవి'లో ఉంటాను. 'కవి'లో ఉండను. 'టిప్పు'లో ఉంటాను. 'అప్పు'లో ఉండను. 'పంది'లో ఉంటాను. 'పది'లో ఉండను. 'కీడు'లో ఉంటాను. 'కీలు'లో ఉండను. ఇంతకూ నేనెవర్ని? 2. నేనో మూడక్షరాల పదాన్ని. 'పదం'లో ఉంటాను. 'పాఠం'లో ఉండను. 'వరం'లో ఉంటాను. 'కారం'లో ఉండను. 'మైనం'లో ఉంటాను. 'మైనా'లో ఉండను. ఇంతకూ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'సంత'లో ఉంటాను కానీ 'చింత'లో లేను. 'గీత'లో ఉంటాను కానీ 'రాత'లో లేను. 'గతం'లో ఉంటాను కానీ 'గతి'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను అయిదు అక్షరాల పదాన్ని. 'అలక'లో ఉంటాను కానీ 'గిలక'లో లేను. 'వరద'లో ఉంటాను కానీ 'బురద'లో లేను. 'యముడు'లో ఉంటాను కానీ 'భీముడు'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'కీలు'లో ఉంటాను కానీ 'కీడు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?