Skip to main content

Posts

సామెతలు

1. మోసేవాడికి తెలుసు _ _ _ బరువు. 2. ముందు .. నుయ్యి వెనక _ _  3. _ _ _ లో పోసిన పన్నీరు. 4. తింటే గారెలు తినాలి. వింటే _ _ _ వినాలి. 5. కొరివితో _ _ గోక్కున్నట్లు.

బిజి గజి

బిజగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. కదలబం 2. తంపాహిమ 3. ఆగ్యాయురోలురా 4. లులసవావదు 5. శంభాతదేర 6. దనావంలు 7. రసవినక 8. షేజభికంలా

పొడుపు కథలు

పొడుపు కథలు I. కడుపు నిండా నల్లటి రాళ్లు, తెల్లటి పేగులు. ఏంటది? 2. చక్కని మానుకు కొమ్మలే లేవు. అదేంటో? 3. ఇల్లంతా వెలుగే కానీ, బల్ల కింద మాత్రం చీకటి. ఏంటబ్బా? 4. కప్ప తాకని నీరు.. పురుగు పట్టని పువ్వు. ఏంటో తెలిసిందా?

హరి ప్రస్తుత వయస్సు ఎంత?

హరి వయసు రాకేష్ వయసు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఐదేళ్ల తర్వాత హరి వయసు రాకేష్ వయసు కంటే మూడు రెట్లు ఎక్కువ. హరి ప్రస్తుత వయస్సు ఎంత?

నేనెవర్ని

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'తాజా'లో ఉంటాను కానీ కాజా'లో లేను. 'గుడి'లో ఉంటాను కానీ 'బడి'లో లేను. 'నీడ'లో ఉంటాను కానీ 'గోడ'లో లేను. 'కారు'లో ఉంటాను కానీ 'కాలం'లో లేను. నేనెవరినో తెలిసిందా 2. నేనో అయిదక్షరాల పదాన్ని. 'పాము' ఉంటాను కానీ 'వాము'లో ఉండను. 'వల'లో ఉంటాను కానీ 'వనం'లో ఉండను. 'కల'లో ఉంటాను కానీ 'ఇల'లో ఉండను. 'వరం'లో ఉంటాను కానీ 'వారం'లో ఉండను. 'స్వర్గం'లో ఉంటాను కానీ 'స్వరం'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?